Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నటిపై లైంగిక దాడి కేసులో న్యూ ట్విస్ట్.. దిలీప్ సోదరుడి దగ్గర వీడియోలు?
ప్రముఖ హీరోయిన్ ను కిడ్నాప్ చేయడమే కాకుండా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కేరళ నటుడు దిలీప్ కుమార్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2017 నుంచి కొనసాగుతున్న ఈ కేసు ప్రతీసారి ఓ కొత్త తరహా మలుపు తిరుగుతోంది. ఇక గత కొన్ని నెలలుగా బయటపడిన కీలకమైన సాక్ష్యాల ఆధారంగా మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఇక ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని హైకోర్టును కోరింది.
ఇక హీరోయిన్ ను కిడ్నాప్ చేసినప్పుడు లైంగికంగా వేదించినప్పుడు వీడియో రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ విషయంపై విచారణ జరుపుతూ సేకరించిన డిజిటల్ డేటాలో, నిందితుడు నటుడు దిలీప్ సోదరుడు అనూప్ ఫోన్ నుండి పోలీసులు కొన్ని ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలతో బయటపడిన నటిపై లైంగికంగా వేదించిన వీడియోలు ఉన్నాయని అందుకు విజువల్స్ ఆధారాల కోసం వాటిని ఫొటోలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దిలీప్ అనుచరుడు ప్రధాన నిందితుడు పల్సర్ సునీ వీడియో రికార్డ్ చేసినట్లుగా విచారణలో ప్రస్తావించారు.
Recommended Video


ఇక ఆ సాక్షాల ఆధారంగా అనూప్‌ని వివరణ కోరగా.. దిలీప్ తరపు న్యాయవాది రాసిన నోట్స్‌ను ఫోటో తీశానని అనూప్ తెలిపాడు. ఇక సరైన సమాధానం కోసం నిందితులతో పాటు అతని న్యాయవాదులు కూడా కోర్టులో మాత్రమే విజువల్స్ చూసేందుకు అనుమతించారు. దిలీప్ తరపు న్యాయవాదులు విజువల్స్ ను అలా దాచుకోవడంపై సందేహాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. దాడికి సంబంధించిన మరిన్ని ఒరిజినల్ విజువల్స్ కాపీ దిలీప్ వద్ద ఉండవచ్చనే ఆరోపణలు వచ్చాయి.
2017 నుంచి ఈ ఆధారాలతో విచారణ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు దిలీప్ తరపు న్యాయవాదులు అతను ఎలాంటి నేరం చేయలేదని వాదిస్తూనే ఉండగా మరోవైపు ప్రాసిక్యూషన్ లో అతని అనుమానం వచ్చేలా వివిధ రకాల ఆధారాలు బయటపడుతున్నాయి. ఇక మెమోరి కార్డ్ కూడా దిలీప్ దగ్గర ఉండవచ్చు అని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఇక త్వరలోనే మరొక విచారణతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.