twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ బస్టర్ రైటర్, దర్శకుడు కన్నుమూత.. గుండెపోటుకు గురై సినిమా ప్రముఖులకు తీరని విషాదం

    |

    మలయాళ సినీ ప్రముఖుడు, రచయి డెన్సీస్ జోసెప్ ఇకలేరు. గుండెపోటు రావడంతో కొట్టాయంలోని హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డెన్సీస్ జోసఫ్‌కు మలయాళంలో బ్లాక్ బస్టర్ సినీ రచయితగా, దర్శకుడిగానే కాకుండా పలువరు ప్రముఖ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చిన స్టార్ రైటర్‌గా గొప్ప పేరు ఉంది. ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వస్తే..

    కొట్టాయంలో 1957లో

    కొట్టాయంలో 1957లో

    రచయిత, దర్శకుడు డెన్నీ్ జోసెఫ్ 1957 అక్టోబర్ 20వ తేదీన కొట్టాయంలోని ఎట్టుమనూర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. కురవిలంగద్‌లోని దేవ మాతా కాలేజ్‌ నుంచి బీఎస్పీ పట్టా పుచ్చుకొన్నారు. ఆయనకు భార్య లీనా, కుమారుడు జోస్, ఎలిజబెట్, రోజీ అనే కూతుళ్లు ఉన్నారు.

    1985లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి

    1985లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి

    మలయాళ చిత్ర పరిశ్రమలోకి 1985లో ఈరన్ సంధ్య అనే చిత్రం ద్వారా రచయితగా ప్రవేశించారు. ఆ తర్వాత మలయాళ సినిమాలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిరకూట్టు, రాజవింతే మాకన్, శ్యామ, న్యూ ఢిల్లీ,20 మద్రాస్ మెయిల్, కుట్టాయం కుంజన్, ఆకాశదూత, పాలయం, ఎఫ్ఐఆర్‌కి పనిచేశారు.

    దశాబ్దకాలంలో సూపర్‌హిట్లతో రచ్చ

    దశాబ్దకాలంలో సూపర్‌హిట్లతో రచ్చ

    మాలీవుడ్‌లో 1980 నుంచి 1990 వరకు ప్రతీ అగ్ర దర్శకుడితో పనిచేయడమే కాకుండా సూపర్‌హిట్ చిత్రాలను అందిచారు. రచయితనే కాకుండా అగ్రజన్, తుడార్ కథా, అప్పు, అధర్వమ్, మను అంకుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మమ్ముట్టి నటించిన మను అంకుల్‌కు జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు దక్కింది.

    Recommended Video

    Malayalam Young Director Jibit George Passed Away | Filmibeat Telugu
    చివరిగా ప్రియదర్శన్, మోహన్‌లాల్‌తో కలిసి

    చివరిగా ప్రియదర్శన్, మోహన్‌లాల్‌తో కలిసి

    డెన్నీస్ జోసెఫ్ చివరి సారిగా ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన గీతాంజలి చిత్రానికి పనిచేశారు. ఇటీవల దర్శకుడు ఒమర్ లూలు రూపొందించే చిత్రానికి రచయితగా పనిచేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక గుండెపోటుకు గురై మరణించడం మాలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది. డెన్నీస్ జోసెఫ్ మృతికి మోహన్ లాల్‌తోపాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

    English summary
    Dennis Joseph no more: Super Hit writer, Director died with Cardiac Arrest in Kottayam. In 1985, He entered into mollywood as screen writer Eeran Sandhya. Many celebraties are condolenced to popular and Hit writer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X