నటి కిడ్నాప్ కేసులో.. హీరో దిలీప్‌కు ఊరట...
మలయాళ నటి కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో హీరో దిలీప్‌కు ఊరట లభించింది. తన అనుచరులతో నటిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దిలీప్‌ను అరెస్ట్ చేయగా, ఇటీవల ఆయన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోచి కోర్టులో జరుగుతున్నది.

కిడ్నాప్, అత్యాచారయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను, ఫోటోలను, వీడియోలను చేసేందుకు దిలీప్‌కు కోర్టు అనుమతించింది. అయితే నిందితుడికి ఈ కాపీలను ఇవ్వాలా వద్దా అనే అంశంపై కేరళ హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసును మార్చి 28వ తేదీకి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











