»   » కుట్ర జరిగింది.. నా మాజీ భార్యే ఇరికించింది.. హీరో సంచలన వ్యాఖ్యలు!

కుట్ర జరిగింది.. నా మాజీ భార్యే ఇరికించింది.. హీరో సంచలన వ్యాఖ్యలు!

Subscribe to Filmibeat Telugu

మలయాళీ నటి భావన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మలయాళీ స్టార్ హీరో దిలీప్ ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈ కేసులో జైల్లో కొన్ని రోజులుగడిపిన దిలీప్ ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. దిలీప్ ఈ కేసులో కొత్త వాదన వినిపిస్తున్నాడు. భావన లైంగిక వేధింపుల కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని అంతా చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది ఫిబ్రవరిలో భావన కిడ్నాప్ మరియు లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులని పోలీస్ లు అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో ఈ కుట్రలో ప్రముఖ నటుడు దిలీప్ హస్తం కూడా ఉందని భావించిన పోలీస్ లు అతడిని అరెస్ట్ చేసిన విచారణ మొదలుపెట్టారు. దిలీప్ కు కోర్టు పలు పర్యాయాలు బెయిల్ నిరాకరించింది. చివరకు బెయిల్ లభించడంతో దిలీప్ విడుదల అయ్యాడు.

I am trapped by ex wife Manju Warrier says Dileep

తాజగా దిలీప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన మాజీ భార్య మంజు వారియర్ తనపై పగ పెంచుకుని కుట్ర పన్నిందని ఆరోపించాడు. ఆమె కుట్రకు తాను బలైనట్లు దిలీప్ వెల్లడించారు. మంజు వారియర్ ప్రముఖ నటుడు లాల్ ఇద్దరూ కలసి ఈ కేసులో తనని ఇరియించారని దిలీప్ ఆరోపించారు. ప్రధాన నిందితుడుగా ఉన్న పల్సర్ సునితో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. ఇంకా ఈ కేసు విచారణ దశలోనే ఉండడంతో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

English summary
I am trapped by ex wife Manju Warrier says Dileep. New twist in Bhavana case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X