»   » ప్రముఖ నటుడు అజిత్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో!

ప్రముఖ నటుడు అజిత్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ మలయాళీ నటుడు కొల్లం అజిత్ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యతో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడుపులో సమస్యలతో ఆయనకు తీవ్ర అనారోగ్యం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపుతప్పడంతో గురువారం తెల్లవారు జామున అజిత్ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

అజిత్ 90 లలో సౌత్ మొత్తం ప్రముఖ నటుడిగా కొనసాగారు. అజిత్ తన కెరీర్ లో 500 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 'పరన్ను పరన్ను పరన్ను' అనే మలయాళీ చిత్రంతో 1983 లో సినీరంగప్రవేశం చేసారు. అజిత్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో మెరిశాడు. ఆయన కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించడం విశేషం.

Malayalam actor Ajith passes away

కొల్లం అజిత్ కేవలం మలయాళీ చిత్రాల్లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. అజిత్ చివరగా 2012 లో ఇవాన్ అర్ధనారీ అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత ఆయన వెండి తెరకు దూరమయ్యారు. అజిత్ కు భార్య ప్రమీల. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. అజిత్ మృతితో మలయాళీ చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

English summary
Malayalam actor Ajith passes away. He was suffering health issues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X