ప్రధానితో మోహన్‌లాల్ భేటి.. స్ఫూర్తిని కలిగించాడని మోదీ ట్వీట్!
ప్రధాని నరేంద్రమోదీని ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ కలుసుకొన్నారు. గతంలోనే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో శ్రీకృష్ణాష్టమి రోజున వీరి మధ్య భేటీ జరిగింది. పలు అంశాలను ప్రధానితో మోహన్‌లాల్ చర్చించినట్టు తెలిసింది.
పేదరికంతో బాధపడుతున్న వారికి, విద్యరంగానికి చేయూత కోసం తాను స్థాపించిన విశ్వశాంతి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రధానికి మోహన్‌లాల్ వివరించినట్టు సమాచారం.

మోహన్‌లాల్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ మంగళవారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సోమవారం మోహన్‌లాల్‌ను కలిశాను. ఆయన చేస్తున్న సామాజిక సేవ అద్భుతం. నాకు స్ఫూర్తిని కలిగించింది అని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీతో భేటి గురించి మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. జన్మాష్టమి లాంటి పర్వదినాన ప్రధాని మోదీజీని కలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. నా నేతృత్వంలో కొనసాగుతున్న విశ్వశాంతి ఫౌండేషన్ గురించి, నా సామాజిక సేవల గురించి వివరించే అవకాశం దక్కింది అని మోహన్‌లాల్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ తమిళ చిత్రంలో మోహన్‌లాల్ నటిస్తున్నాడు. మలయాళంలో ఆయన నటిస్తున్న ఓడియాన్, కయమ్‌కులం, డ్రామా, లుసిఫర్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
అయితే ప్రధానితో భేటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. త్వరలోనే కేరళ బీజేపీలో మోహన్‌లాల్ చేరనున్నారనే వార్తలు జోరందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











