Just In
- 18 min ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
- 54 min ago
టాలీవుడ్‌కు మరో యువ హీరో.. విభిన్నమైన సినిమాతో రెడీ..
- 1 hr ago
బాక్సింగ్ ఛాంపియన్‌గా మోహన్ లాల్.. లూసిఫర్ సీక్వెల్‌కు సూపర్‌స్టార్ రెడీ
- 1 hr ago
Vakeel Saab 5 days Collections: పండుగ రోజు ‘వకీల్ సాబ్’ రికార్డు.. ఏకంగా డబుల్ ఫిగర్‌తో పవన్ హవా
Don't Miss!
- News
వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సీరియస్ , జగన్ మెచ్చుకున్న మరుసటి రోజే డిప్యూటీ సీఎం క్లాస్
- Sports
SRH vs RCB: కేన్ మామకు దక్కని చోటు.. హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు.. ఆర్సీబీదే బ్యాటింగ్!
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Finance
బంగారం దిగుమతులు సరికొత్త రికార్డ్, 471 శాతం జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్.. మోహన్ లావ్ క్రేజ్‌కు నిదర్శనమిదే!
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మళయాలి పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించాలన్నా, అందరూ ఆశ్చర్యపోయే కథకథనాలు సినిమాలను రూపొందించాలన్నా కూడా అది మాలీవుడ్ వల్లే అవుతుంది. అయితే అక్కడ మాత్రం కలెక్షన్లు అంతగా రావు. గట్టిగా వంద కోట్లు కొల్లగొట్టే సినిమాలు ఏడాదికి ఒకటి రెండు కూడా రావు. వంద కోట్లు కొల్లగొట్టాయంటే అది పెద్ద వండర్.
అలాంటి తరుణంలో మోహన్ లాల్ తన లూసిఫర్ సినిమాతో వంద కోట్లను కొల్లగొట్టేశాడు. అలా మొదటి సారి వంద కోట్ల రికార్డ్ మోహన్ లాల్ ఖాతాలోనే పడింది. అయితే తాజాగా మరో కొత్త రికార్డ్ మోహన్ లాల్ పేరిట నమోదు అయింది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం 2 సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ మూవీపై అన్ని వైపులా పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా 20 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. మాలీవుడ్ హిస్టరీలోనే ఇలా ఓ ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టడం విశేషమట. ఇదే విషయాన్ని మోహన్ లాల్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. దటీజ్ లాలెట్టాన్ అంటూ మోహన్ లాల్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన పార్ట్ 2కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అన్ని భాషల ఇండస్ట్రీలు రీమేక్‌కు ముందుకు వచ్చాయి.