కేరళ కోసం ప్రియా వారియర్ సహాయం.. మాటలు కాదు చేతలని..
వరదలు ముంచెత్తిన కేరళను ఆదుకోవడం కోసం సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు భాషలకు చెందిన నటీ, నటులు, సాంకేతిక నిపుణులు ఆర్థికంగానూ, వస్తు రూపేణ సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ప్రియా వారియర్ కేరళవాసుల దీనస్థితిని చూసి తన వంతు సహాయాన్ని అందించారు.
కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రియా వారియర్ రూ.1 లక్ష సహాయంగా అందించింది. ఈ మేరకు తన సహాయాన్ని ముఖ్యమంత్రి నిధికి అందజేసింది. దాంతో పాటు కేరళ ప్రభుత్వానికి రాసిన లేఖను జత చేసింది.

కష్టాల్లో ఉన్న నా రాష్ట్రానికి నా శక్తి మేరకు సహాయం అందిస్తున్నాను. మాటల చెప్పడం కంటే చేతలే మిన్న. నేను అందజేస్తున్న డబ్బును సద్వినియోగపరిచేందుకు ప్రయత్నించండి. ఇది ప్రచారం కోసం చేస్తున్నది కాదు అని ప్రియ తన లేఖలో పేర్కొన్నారు.
ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ సాంగ్ లో కన్నుగీటిన వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ఒరు ఆధార్ లవ్ చిత్ర టీజర్ విడుదల అయిన తరువాత ప్రియా వారియర్ నేషనల్ వైడ్ సంచలనంగా మారిపోయింది. కన్నుగీటిన వీడియోతో యువత హృదయాలకు చిల్లులు పెట్టేసింది. దీనితో సెలబ్రిటీలు, అభిమానులు తేడా లేకుండా ప్రియ వారియర్ జపం చేశారు.


Click it and Unblock the Notifications











