»   » తెలుగు బిగ్‌బాస్ హౌస్ లోకి తాప్సీ: నిన్నంతా అక్కడే గడిపిన ఢిల్లీ బ్యూటీ

తెలుగు బిగ్‌బాస్ హౌస్ లోకి తాప్సీ: నిన్నంతా అక్కడే గడిపిన ఢిల్లీ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బిగ్‌బాస్‌ షో తెలుగులో ఇప్పుడున్న అన్ని షో లకూ ఒక ధీటైన పోటీ అయ్యింది. దీన్ని కేవలం షో గానే వదలకుండా రాబోయే సినిమాల ప్రమోషన్ కోస్సం కూడా వాడేస్తున్నారు. మిగతా వాటికన్నా ఈ షోకు ఇప్పుడు అత్యధిక టీఆర్పీ రేటింగులు ఉండటంతో నటీనటులు సైతం తమ సినిమా ప్రచారం కోసం బిగ్‌బాస్‌షోని ఉపయోగించుకుంటున్నారు.

మరింత పాపులర్ అయ్యింది

మరింత పాపులర్ అయ్యింది

ఇందుకోసం కొత్త కొత్త నటులు షోలోకి గెస్ట్‌ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రచారం కోసం దగ్గుబాటి రానా గత వారం బిగ్‌బాస్‌ షోలో సందడి చేశాడు. అప్పటికే ఫావప లో ఉన్న షో వివాదాస్పద నటూడు నవదీప్ ఎంట్రీ తో ఇప్పుడు మరింత పాపులర్ అయ్యింది.


Bigg Boss Telugu : Tapsee Grand Entry And Surprise Fun in Bigg Boss
పార్టిసిపెంట్ గా కాదు

పార్టిసిపెంట్ గా కాదు

ఇక ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్ లోకి మళ్ళీ ఒక కొత్త హీరోయిన్ అడుగు పెట్టింది. అయితే ఈవిడ గారు అక్కడికి వెళ్ళింది షో పార్టిసిపెంట్ గా కాదు తన సినిమా ప్రమోసన్ కోసమే ఇంతకీ ఎవరా నటి అంటే.... టాలీవుడ్ లో కొబ్బరికాయ బొడ్డుమీద వేసారు అంటూ అప్పటివరకూ సైలెంట్ గా ఉండి ఒక్క మాటతోనే టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన తాప్సీ.


రాఘవేంద్ర రావు గారి మీదే పంచ్

రాఘవేంద్ర రావు గారి మీదే పంచ్

ఆమధ్య రాఘవేంద్ర రావు గారి మీదే పంచ్ వేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది ఈ డిల్లీ పిల్ల, అసలు ఆమె "ఆనందో బ్రహ్మ" సినిమాని టాలీవుడ్ లో విడుదల కానివ్వం అన్న బెదిరిపంపులు వచ్చేసరికి క్షమాపన చెప్పటమే కాదు, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ ని కూడా తన నెత్తికెత్తుకుంది.


కామెడీ హర్రర్ ఆనందో బ్రహ్మా

కామెడీ హర్రర్ ఆనందో బ్రహ్మా

తాజాగా హీరోయిన్‌ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కి.. తొలి ట్రైలర్ నుంచి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కామెడీ హర్రర్ మూవీ ఆనందో బ్రహ్మా. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా సినిమా యూనిట్‌ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. నిన్నటిషో లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ బిగ్ బాస్ పార్టిసిపెంట్లతో సందడి చేసి. అయితే ఈ రోజు విడుదల కానున్న ఆనందో బ్రహ్మ కి ఈ ప్రమోషన్ ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.English summary
Tapsee Pannu is the latest celeb to use Bigg Boss for the sake of promotions. She will enter the House for generating buzz about 'Anando Brahma' releasing To day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu