X
చారులత

చారులత

Horror | 21 Sep 2012 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

చారులత స్టోరీ

చారులత సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రియమణి, స్కంద, సరణ్య పొన్వన్నన్, సీత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పొన్ కుమరన్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ కృష్ణా మూర్తి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుందర్ సి బాబు స్వరాలు సమకుర్చరు.  కథ చారు, లత... ఇద్దరూ ఒకే శరీరం, ఒకే ఆత్మతో బ్రతుకుతూంటారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఈ ఇద్దరిదీ విడదీయరాని బంధం. ఈ నేపథ్యంలోనే రవి(స్కంద) వారి జీవితాల్లో ప్రేమ అంటూ ప్రవేశిస్తాడు. చారుపై అతను చూపే ప్రేమ వారిని మానసికంగా గానే కాక భౌతికంగా విడిపోయే స్ధితికి తీసుకువస్తుంది. అతుక్కున్న శరీరాలతో జీవితం కష్టం కాబట్టి... విడిపోవడానికి సిద్ధపడతారు. వాళ్లు విడిపోయాక ఆ ట్విన్స్ లో ఒకరు మరణిస్తారు. అక్కడనుంచీ మిస్టరీ మొదలవుతుంది. చనిపోయిన ఆత్మ బ్రతికి ఉన్న తన సోదరిపై పగ తీర్చుకోవటం మొదలెట్టి ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అప్పుడేం జరిగింది. ఇంతకీ చనిపోయింది ఎవరు అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

చారులత కాస్ట్ & క్రూ

చారులత సిబ్బంది సమాచారం

దర్శకత్వం పొన్ కుమరన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సుందర్ సి బాబు
నిర్మాత రమేష్ కృష్ణా మూర్తి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చారులత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ చిత్రం పూర్తిగా ప్రియమణి నటనా కౌశలం మీదే ఆధారపడి తీశారని చెప్పచ్చు. ముఖ్యంగా చారు, లతల్లో ఒక యువతి దూకుడు గలది అయితే మరో యువతి అమాయకురాలు. ఆ పాత్రలు మధ్య వైవిధ్యం చూపుతూ హావభావాలు పండించటంలో ప్రియమణి.. జాతీయ అవార్డు సాధించిన తన పవర్ ఏంటో మరో సారి చూపించనట్లు అయ్యింది. అయితే థాయ్ సినిమాగా చూసినప్పటి కిక్ ఈ సినిమా ఇవ్వదు. దానికి కారణం ఫస్టాఫ్, సెకండాఫ్ అంటూ సినిమాని విభజించి సీన్స్ పెంచటం ఓ కారణం. అలాగే ఒరిజనల్ సినిమానే కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా ఎండ్ ట్విస్ట్ తో థ్రిల్లర్ గా ఉంటుంది. అంటే అప్పటివరకూ ప్రేక్షకుడుని ఎంగేజ్ చేయాలి. ఇండియనైజ్ చేసే క్రమంలో 'చారులత' నీరసపడిందనే చెప్పాలి.

చారులత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చారులత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+