For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియే ‘చారులత’ (రివ్యూ)

  By Srikanya
  |

  ప్రియమణితో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయవచ్చా.. ఆమే మొత్తం సినిమా భారాన్ని మోయగలదా... అంటే ఒక్క ప్రియమణి కాదు...ఇద్దరు(డబుల్) ఉన్నారు కాబట్టి ఆ సమస్య రాదు అని ఇండస్ట్రీలో వినపడిన మాట. చారులత సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఏ ప్రియమణి సినిమాకీ రాని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలలుగా నటించటం ఓ కారణమైతే.. తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ కావటం మరో కారణం. హర్రర్ సినిమా అని పబ్లిసిటీ చేసిన ఈ సినిమా ఊహించినంతగా జనాలని భయపెట్టలేకపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసినట్లున్న ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.

  నటీనటులు: ప్రియమణి, సీత, శరణ్య, ఆర్తి తదితరులు
  ఛాయాగ్రహణం: ఎన్‌.వి.పన్నీర్‌ సెల్వం,
  సంగీతం: సుందర్‌ సి.బాబు.
  దర్శకత్వం: పొన్ను కుమరన్
  నిర్మాత: రమేష్ కృష్ణమూర్తి
  విడుదల తేదీ: 21, సెప్టెంబర్ 2012

  'చారులత' అవిభక్త కవలలు, వారి ప్రేమ చుట్టూ అల్లుకున్న థ్రిల్లర్. చారు, లత... ఇద్దరూ ఒకే శరీరం, ఒకే ఆత్మతో బ్రతుకుతూంటారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఈ ఇద్దరిదీ విడదీయరాని బంధం. ఈ నేపథ్యంలోనే రవి(స్కంద) వారి జీవితాల్లో ప్రేమ అంటూ ప్రవేశిస్తాడు. చారుపై అతను చూపే ప్రేమ వారిని మానసికంగా గానే కాక భౌతికంగా విడిపోయే స్ధితికి తీసుకువస్తుంది. అతుక్కున్న శరీరాలతో జీవితం కష్టం కాబట్టి... విడిపోవడానికి సిద్ధపడతారు. వాళ్లు విడిపోయాక ఆ ట్విన్స్ లో ఒకరు మరణిస్తారు. అక్కడనుంచీ మిస్టరీ మొదలవుతుంది. చనిపోయిన ఆత్మ బ్రతికి ఉన్న తన సోదరిపై పగ తీర్చుకోవటం మొదలెట్టి ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అప్పుడేం జరిగింది. ఇంతకీ చనిపోయింది ఎవరు అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పూర్తిగా ప్రియమణి నటనా కౌశలం మీదే ఆధారపడి తీశారని చెప్పచ్చు. ముఖ్యంగా చారు, లతల్లో ఒక యువతి దూకుడు గలది అయితే మరో యువతి అమాయకురాలు. ఆ పాత్రలు మధ్య వైవిధ్యం చూపుతూ హావభావాలు పండించటంలో ప్రియమణి.. జాతీయ అవార్డు సాధించిన తన పవర్ ఏంటో మరో సారి చూపించనట్లు అయ్యింది. అయితే థాయ్ సినిమాగా చూసినప్పటి కిక్ ఈ సినిమా ఇవ్వదు. దానికి కారణం ఫస్టాఫ్, సెకండాఫ్ అంటూ సినిమాని విభజించి సీన్స్ పెంచటం ఓ కారణం. అలాగే ఒరిజనల్ సినిమానే కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా ఎండ్ ట్విస్ట్ తో థ్రిల్లర్ గా ఉంటుంది. అంటే అప్పటివరకూ ప్రేక్షకుడుని ఎంగేజ్ చేయాలి. ఇండియనైజ్ చేసే క్రమంలో 'చారులత' నీరసపడిందనే చెప్పాలి. టెక్నికల్ గా చెప్పాలంటే సినిమా ఓకే అనిపిస్తుంది. దర్శకుడు ఒరిజినల్ సినిమానే చాలా భాగం ఫాలో అయ్యాడు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు. డైలాగ్స్, కెమెరా అద్భుతం కాదు కానీ, సినిమాకు సరిపడా ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన చిత్రం కావటంతో నిర్మాతలుకు మాత్రం ఓపినింగ్స్ తృప్తినే కలిగించి ఉంటాయి.

  ఇక ప్రియమణి అభిమానుల కోసమే తీసినట్లున్న ఈ చిత్రం స్క్రిప్టుపై మరింత కష్టపడితే మంచి హర్రర్ సినిమాగా మారేది. అప్పటికి ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఓకే అనిపిస్తుంది. అదీ థాయ్ సినిమా 'అలోన్' చూడని వారికి మాత్రమే సుమా. అవార్డుల రేసులో మాత్రం ప్రియమణికి మరోసారి నిలబడే అవకాశం ఇస్తుందీ సినిమా.

  English summary
  Charulatha, which has National Award winning actress Priyamani playing conjoined twins released today( September 21) with ok talk. Inspired by Thai horror Alone (2007 film), the film will have Priyamani playing the lead role. Malayalam actor Skandha will play the male protagonist. Actors such as Saranya Ponvannan, Seetha and Vettaikaran Sai Sasi will be doing crucial roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X