For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొందరి కుయుక్తులే కారణం: ప్రియమణి

  By Srikanya
  |

  చెన్నై: నాకు అవకాశాలు రాకపోవటానికి కొందరి కుయుక్తులే కారణం. అలా చేస్తున్నారనే సందేహం కొందరిపై కూడా ఉంది. మరో విషయం... అలా జరిగినా బాధపడను. నా కోసమే పుట్టిన పాత్ర ఎవరు అడ్డుకున్నా నా నుంచి దూరం కాదు అంటోంది ప్రియమణి. గత ఏడాదితో పోలిస్తే... ఈ ఏడాది వెనుకబడ్డారేంటని ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఇలా స్పందించింది. అలాగే "అవకాశం వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుంటే... ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ని ఒప్పుకుంటున్నారు అంటారు. కాస్త మంచి ప్రాజెక్టుల కోసం ఆగితే చాలు... ఆ హీరోయిన్‌కి అవకాశాలు రావడం లేదని ప్రచారం చేస్తారు. ఎలా అండి మీతో? ప్రస్తుతం నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి'' అని చెబుతోంది ప్రియమణి.

  అభినయంతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న కొద్దిమంది హీరోయిన్స్ లో ప్రియమణి ఒకరు. గ్రామీణ యువతిగా కనిపించి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నా, అందాలను ప్రదర్శించి కుర్రకారును హుషారెక్కించడంలోనూ తనదైన ముద్ర వేసింది. సూర్య 'బ్రదర్శ్ ‌'కు పోటీగా 'చారులత'గా వచ్చి సినీవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సూర్య, తాను ఒకే తరహా(అవిభక్త కవలలు) పాత్రలో నటిస్తుండటం ముందే తెలియదని అంటోంది. దీనిపై సూర్య మీతో చర్చించేలేదంటోంది. సూర్య బ్రహ్మాండమైన సినిమాలో నటిస్తున్నారని మాత్రమే తెలుసు. అయితే ఒకే తరహా పాత్ర అన్న విషయం మొదట్లో తెలియదు అంది.

  హీరోయిన్ అనగానే హీరో ప్రక్కన డాన్స్ చేస్తూ.. అందాలు ఒలకబోయటం అనేది చాలా కాలంగా వస్తున్న విషయం.. ఇప్పుడా పరిస్ధితుల్లో మార్పు వస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ వచ్చి హీరోయిన్స్ ఐడెంటిటీని కాపాతున్నాయంటోంది ప్రియమణి. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ... ''దాదాపు తొంభై శాతం చిత్రాల్లో హీరోయిన్స్ పాటల్లో అందాలు ఆరబోస్తూ డ్యాన్స్‌ చేయడానికే పరిమితం అవుతున్నారు. ప్రేక్షకులు కూడా హీరోయిన్స్ ని అలా చూడటానికే ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అందాల ఆరబోతతో పాటు కొత్తదనం కూడా కోరుకుంటున్నారు. అందుకే హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. సినిమాల్లో హీరోయిన్స్ ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇది మంచి పరిణామం అంటోంది ప్రియమణి.

  జాతీయ స్థాయి ఉత్తమ నటి అనిపించుకున్నాను కాబట్టి నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే నటించాలని నియమాలు పెట్టుకోలేదు అంటోంది. టూ పీస్‌ దుస్తుల్లో కనిపించడానికి కూడా వెనుకాడలేదని గుర్తు చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... జాతీయ అవార్డు వచ్చిందని ఒంటినిండా వస్త్రాలతోనే కనిపించాలా? అది 'ముత్తళిగి' పాత్రతోనే ముగిసింది. ప్రతి సినిమాలోనూ లంగా, ఓణీతో కనిపించలేం. అయినా అందాలు ప్రదర్శిస్తే తప్పేంటి? మీకో విషయం చెప్పనా... నాకు గ్లామర్‌గా నటించటమే ఇష్టం అంది.

  English summary
  Priyamani has dismissed reports that her mother visits Chennai often to hunt Kollywood projects for her. "We will never go behind offers. And there is no necessity for us to do that," says the National Award winning actress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X