X
దంగల్

దంగల్

Biography | 23 Dec 2016 |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

దంగల్ స్టోరీ

దంగల్ (యుద్దం) సినిమా లెంజడరీ రెజ్లర్‌ మహావీర్‌ పోగట్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇందులో అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ బట్నాగర్ , గౌతమ్ గులాటి, అపర్ శక్తి ఖుర్రన, రాజ్ కుమార్ రావు, విక్రమ్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నితేశ్ తివారీ నిర్వహించారు మరియు నిర్మాతలు అమీర్ ఖాన్, సిద్దార్థ్ రాయ్ కపూర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.  కథ మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రెజ్లర్. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. తన కల నెరవేరక పోవడంతో తనకు పుట్టబోయే కుమారుల ద్వారా అయినా అది నిజం చేయాలని భావిస్తారు. అయితే ఆయన భార్య శోభా కౌర్‌(సాక్షి తన్వార్‌) నాలుగు సార్లు ఆడపిల్లలనే ప్రసవిస్తుంది. తన కల నిజం కాదని డీలా పడిపోయిన ఫోగట్... అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్‌(ఫాతిమా), బబిత కుమారీ(సాన్యా మల్హోత్ర) బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతారు. వారిని రెజ్లర్లుగా తీర్చిదిద్ది తన కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం వారికి తానే స్వయంగా కఠోర శిక్షణ ఇస్తాడు. మరి మహవీర్ సింగ్ ఫోగట్ కల నెరవేరిందా? లేదా? అనేది అనేది తెరపై చూడాల్సిందే.
Read More

దంగల్ కాస్ట్ & క్రూ

దంగల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నితేశ్ తివారీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రీతమ్
నిర్మాత అమీర్ ఖాన్, సిద్దర్థ్ రాయ్ కపూర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దంగల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అమీర్ ఖాన్ మరోసారి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. యంగ్ రెజర్‌గా, మధ్య వయసు తండ్రి పాత్రలో జీవించాడు. రెండు పాత్రలకు అనుగుణంగా తన శరీరాన్ని మలచుకుని అదరగొట్టాడు. ఇందుకోసం అమీర్ ఖాన్ కొన్ని నెలల పాటు శ్రమించాడు. దేశానికి గోల్డ్ మెడల్ అందించాలనే పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు. మహవీర్‌సింగ్‌ కూతుళ్లు గీతా ఫోగట్‌గా ఫాతిమా, బబితా కుమారీ పాత్రలో సాన్యా మల్హోత్ర మెప్పించారు. టీవీ నటి సాక్షి తన్వార్ ఇందులో అమీర్ ఖాన్ భార్య పాత్రలో కనిపించి తనదైన నటనతో మెప్పించారు. గతంలో 'చిల్లార్ పార్టీ','భూత్నాథ్ రిటర్న్స్' వంటి సినిమాలు తీసిన అనుభవం ఉన్న నితీష్ తివారీ.... దంగల్ మూవీ కథను, అందులోని భావోద్వేగాల ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా కాస్త స్లోగా ఉన్నా ప్రేక్షకుడి ఆకట్టుకుంటుంది. ప్రీతమ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు ఇలా టెక్నికల్ విభాగ అంతా పర్ ఫెక్టుగా ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే... సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ మాత్రమే కాదు... క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది.

దంగల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దంగల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+