»   » చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్‌ మృతి

చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్‌ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ చలనచిత్ర ఎడిటర్‌, జాతీయ పురస్కార గ్రహీత కిశోర్‌ జీవన్మృతి (బ్రెయిన్‌డెడ్‌) చెందారు. ఆయన వయసు 36 ఏళ్లు. 'పరదేశి', 'ఈరం', 'నెడుంజాలై', 'ఎదిర్‌నీచ్చల్‌'.. వంటి 30కి పైచిలుకు చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగులో 'ఉలవచారు బిర్యానీ', 'గగనం' చిత్రాలకు పనిచేశారు. కన్నడలో 'ఒక్కరానే' సినిమాకు కూడా ఎడిటింగ్‌ సేవలందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పిన్నవయసులోనే ఉత్తమ జాతీయ స్థాయి పురస్కారాన్ని 'ఆడుగలం' చిత్రానికి అందుకున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కిశోర్‌ మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జీవన్మృతి చెందినట్లు వెల్లడించారు. కిశోర్‌ అవయవదానానికి వారి కుటుంబీకులు అంగీకరించారు. శనివారం ఉదయం అవయవాలు దానం చేయనున్నారు.

Tamil Film Editor TE Kishore Dies at 36

ఆయన ఇకలేరనే వార్తతో పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కిషోర్.. దర్శకుడు వెట్టిమారన్ సినిమా ఎడిటింగ్ పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు . హాస్పిటల్‌కు తరలించగా, మెదడులో రక్తం గడ్డ కట్టి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తమిళంలో ఆయన ఎడిటర్‌గా పనిచేసిన ‘ఆడుకాలం' సినిమాకు గానూ ఆయనను జాతీయ అవార్డు వరించింది. ఆడుకాలం సినిమా.. పందెం కోళ్ళు పేరుతో జనవరి 30న తెలుగులో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మింపబడిన సినిమాలు గగనం, ఉలవచారు బిర్యాని వంటి సినిమాలు ఆయనకు తెలుగులోనూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కిషోర్ మృతి పట్ల అటు తెలుగు, తమిళ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రతిభా శాలి, యువకుడైన కిషోర్ ఇలా అర్థాంతరంగా చలించడంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

English summary
National award winning film editor TE Kishore, who was undergoing treatment for a brain stroke, breathed his last on March 6, at a hospital in Chennai, said a family source. Mr Kishore was 36 and died at the Vijaya Hospital. He is survived by his parents.
Please Wait while comments are loading...