»   » తిట్టి తరిమేసిన నాగార్జున

తిట్టి తరిమేసిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య తాజా చిత్రం దడ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో మంచి కాకమీదున్నాడు నాగార్జున.ఈ విషయం చూసుకోకుండా ఓ కుర్ర డైరక్టర్ తన దగ్గర ఉన్న ఓ కథ పట్టుకుని ఓ సీనియర్ ఆర్టిస్టు రికమండేషన్ తీసుకుని నాగార్జున ఎదుట దిగాడు.మొదట తన డేట్స్ ఖాళీ లేవని అన్న నాగార్జున ఆ ఆర్టిస్టు మీద ఉన్న గౌరవం కొద్ది ఆ కాబోయే దర్శకుడుని కూర్చోబెట్టి కథ నేరేట్ చెయ్యమన్నాడు.సదరు డైరక్టర్ కథ ప్రారభించిన ఐదు నిముషాలకు నాగార్జున ఆపమన్నాడు.వెంటనే నిర్మాత ఉన్నాడా అని అడిగాడు.దానికి అతను మీరు ఓకే అంటే ఒకరు ఉన్నారు అన్నాడు.అంటే నా డేట్స్ చూపించి నిర్మాతను పడతావా..ఇంత చెత్త కథతో నన్ను ఏం చేద్దామని వచ్చావు అని ఫైర్ అయ్యిపోయాడట.అంతేగాక కేడి డైరక్టర్ ఇలాగే చెత్త తీసాడు. ఆ తర్వాత దడ డైరక్ట్రర్ వచ్చి నా కొడుకుని ముంచారు.ఇంత చదువుకున్నానంటావు ..ఇంత చెత్త కథ ఎలా రాసావు..ఈ కథ పట్టుకుని ఇంకెప్పుడూ ఇటువైపు రాకు.ముందు కథ తయారు చేసుకోవటం నేర్చుకో..ఆ తర్వాత నా డేట్స్ కోసం వద్దువు గానీ అని మండిపడ్డాడు.బిక్కి చచ్చిపోయన ఆ కుర్ర డైరక్టర్ ని కొంత కాలం ఎక్కడన్నా డైరక్షన్ డిపార్టమెంట్ లో పనిచేయి..నువ్వే మన్నా రామ్ గోపాల్ వర్మవా అని వెళ్ళిపొమ్మని కేకలేసాడని చెప్పుకుంటున్నారు.నాగార్జున ఎప్పుడూ ఇంత కోపంగా ఉండటం చూడని ఆశ్చర్యపోతున్నారు.

English summary
An young director with reference from a senior most actor of the industry approached Nag to narrate his flick. After listening to him for five minutes, Nag understood the situation and lost his temper before bashing him out black and blue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu