X
తెలుగు » సినిమాలు » నాపేరు సూర్య
నాపేరు సూర్య

నాపేరు సూర్య

Action | 04 May 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

నాపేరు సూర్య స్టోరీ

నాపేరు సూర్య (నాఇల్లు ఇండియా) సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, అను ఎమ్మానుయెల్, శరత్ కుమార్, తాకుర్ అనూఫ్ సింగ్, బొమన్ ఇరాణి, రావు రమేష్, వెన్నెల కిశోర్, నధియ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వక్కంతం వంశీ వహించారు మరియు నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ శేఖర్ అందించారు.  కథ భారత సైన్యంలో సూర్య (అల్లు అర్జున్) ఓ సైనికుడు. సమాజంలో ఎవరైనా చిన్న తప్పు చేసినా సహించని వ్యక్తిత్వం. కోపమే అతనికి ఆయుధం. దేశ సరిహద్దులో విధులు నిర్వహించాలనే ఓ కోరిక ఉంటుంది. కానీ ఓ కారణంగా సైన్యం నుంచి సూర్యను కల్నల్ (బోమన్ ఇరానీ) బయటకు పంపిస్తారు. అయితే సూర్యలో ఉన్న మంచి తనాన్ని చూసి ఓ మరో ఛాన్స్ ఇవ్వమని కల్నల్‌కు తన గాడ్ ఫాదర్ (రావు రమేష్) కోరుతాడు. దాంతో కన్విన్స్ అయిన కల్నల్ సూర్యకు అవకాశం ఇస్తాడు. కానీ వైజాగ్‌లో ఉన్న మానసిక వైద్యుడు రామక‌ృష్ణంరాజు (అర్జున్) సంతకం తీసుకొస్తే మళ్లీ సైన్యంలో చేర్చుకొంటానని సూర్యకు ఓ షరతు విధిస్తాడు. అంతేకాకుండా తన కోపం తగ్గించుకోవడానికి 21 రోజుల గడువు విధిస్తాడు. రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య 21 రోజుల అతడి నుంచి సంతకం తీసుకొన్నాడా? సూర్య జీవితంలో తన ప్రేయసి వర్ష (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటి? సూర్య, జ్యోతి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? 21 రోజుల్లో తన కోపాన్ని తగ్గించుకొన్నాడా? రామకృష్ణంరాజుకు సూర్యకు ఉన్న రిలేషన్ ఏమిటీ? రామకృష్ణంరాజుకు సూర్య ఎందుకు దూరమయ్యాడు? రావు రమేష్ ఎందుకు గాడ్‌ఫాదర్‌గా మారాడు? 21 రోజుల్లో సూర్యకు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా పేరు సూర్య చిత్ర కథ.
Read More

నాపేరు సూర్య కాస్ట్ & క్రూ

నాపేరు సూర్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం వక్కంతం వంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ శేఖర్
నిర్మాత సిరిష, బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాపేరు సూర్య విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సరిహద్దులో ఉండే శత్రువుల కంటే దేశంలో ఉండే దుష్టశక్తులే ప్రమాదకరం అనే విభిన్నమైన పాయింట్‌తో దర్శకుడు వక్కంత వంశీ తెరకెక్కించాడు. కథకు అనుగుణంగా ఆకట్టుకొనే డైలాగ్స్‌ను రాసుకోవడంలో మాటల రచయితగా సక్సెస్ అయ్యారు. కానీ ఓ భావోద్వేగాలకు గురిచేసే అంశాలు ఉన్న ఈ కథలో బలమైన సన్నివేశాలను మరింత మెరుగ్గా రాసుకొంటే భారీ విజయాన్ని అందుకొనే అవకాశం ఉండేది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్న నా పేరు సూర్య చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది వారాంతంలో స్పష్టమవుతుంది. ఓవర్సీస్‌లో, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ పొందింతే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం తథ్యం.

నాపేరు సూర్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాపేరు సూర్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+