»   » ‘నగరం’ భేష్.. సూర్య, మురుగదాస్ ప్రశంస.. కథ నమ్మి చేశాను.. సందీప్

‘నగరం’ భేష్.. సూర్య, మురుగదాస్ ప్రశంస.. కథ నమ్మి చేశాను.. సందీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నగరం చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన దర్శకుడు లోకేశ్ కనకరాజును ఇటీవల హీరోలు సూర్య, కార్తీ, దర్శకుడు మురుగదాస్‌ను అభినందనలతో ముంచెత్తారు.

అద్భుతమైన మంచి స్క్రీన్ ప్లే..

‘ఇప్పుడే నగరం (తమిళంలో మానగరం) చిత్రం చూశాను. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో మంచిగా తెరకెక్కించారు. ఆల్ ది బెస్ట్' అని హీరో సూర్య ట్వీట్ చేశారు.

కొత్త టాలెంట్‌కు అభినందన

నగరం గురించి మంచి వార్త విన్నాను. మంచి భవిష్యత్ కోసం కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాల్సిందే. మానగరం టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అని కార్తీ ట్వీట్ చేశారు.

బాగుందని విన్నా.. త్వరలోనే చూస్తా

నగరం చిత్రం మంచిగా ఉందని విన్నాను. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. త్వరలోనే నగరం చిత్రాన్ని చూస్తాను అని దర్శకుడు మురుగదాస్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక

హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక

కథానాయకుడు సందీప్‌ కిషన్‌, రేజీనా, శ్రీ ప్రధాన పాత్రలో లోకేష్‌ కనగరాజు దర్శకత్వంలో నగరం చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది.

దర్శకుడు చెప్పిన కథను నమ్మి చేశా..

దర్శకుడు చెప్పిన కథను నమ్మి చేశా..

దర్శకుడు లోకేశ్ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాను. ఇది ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదిరించి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఆనందంగా ఉంది' గత రెండేళ్లుగా విజయాలులేవు. ఈ నేపథ్యంలో నాకు ఇంత గొప్ప విజయం దక్కడం సంతోషంగా ఉంది అని హీరో సందీప్ కిషన్ భావోద్వేగానికి లోనయ్యారు.

విజయాన్ని ఊహించలేదు

విజయాన్ని ఊహించలేదు

ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తారని వూహించలేదన్నారు. డైరెక్టర్‌గా నేను చేసిన మొదటి చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది అని డైరెక్టర్‌ లోకేశ్ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వినీకుమార్‌ సహదేవ్‌ వ్యవహరించారు.

English summary
Many film personalities wishing the nagaram team. Actor Suriya, karthi, director AR Murugadoss congratulated the director lokesh kanagaraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu