»   » 48 గంటల్లో ‘నగరం’లో ఏం జరిగింది.. (నగరం ప్రీ రిలీజ్ రివ్యూ)

48 గంటల్లో ‘నగరం’లో ఏం జరిగింది.. (నగరం ప్రీ రిలీజ్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సందీప్ కిషన్, శ్రీ, రెజీనా జంటగా తమిళ భాషలో రూపొందిన 'మానగరం' చిత్రం తెలుగులోకి డబ్ అయి 'నగరం' పేరుతో మార్చి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజ్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రం విడుదలకు ముందే తమిళ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకొన్నది.

కొందరి జీవితాల్లో 48 గంటల్లో జరిగిన కథ

కొందరి జీవితాల్లో 48 గంటల్లో జరిగిన కథ

ఓ నగరంలో 48 గంటల వ్యవధిలో కొందరి జీవితాల్లో చోటుచేసుకొన్న సంఘటనలే ఈ చిత్ర కథ. రెజీనా ప్రేమ కోసం తపించే పాత్రలో సందీప్ కిషన్. ప్రేమను కాపాడుకొనేందుకు పట్టణానికి వచ్చి ఇబ్బందుల్లో పడ్డ శ్రీ. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి డ్రైవర్ అవతారం ఎత్తిన చార్లే. నగరంలో మాఫియా డాన్ మధుసూదన్ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా. ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్. ఇలాంటి పాత్రల మధ్య జరిగిన సంఘటనలకు తెరరూపమే నగరం.


టెక్నికల్ టీమ్ పనితీరుపై విమర్శకులు..

టెక్నికల్ టీమ్ పనితీరుపై విమర్శకులు..

ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా కథను తెరకెక్కించుకోవడంలో సంగీత దర్శకుడు జావెద్ రియాజ్, సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్కే, ఎడిటర్ ఫిలోమిన్ అద్భుతమైన ప్రతిభను చూపినట్టు తమిళ మీడియా కోడైకూస్తున్నది.


తొలి చిత్రంతోనే లోకేశ్ అద్భుతం..

తొలి చిత్రంతోనే లోకేశ్ అద్భుతం..

తొలిచిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించారనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. అనేక ట్విస్టులు, సస్పెన్స్‌, హ్యూమర్, ఎమోషన్స్, థ్రిల్స్‌ను తెరకెక్కించడంలో దర్శకుడిగా లోకేశ్ నూటికి నూరు మార్కులు సంపాదించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


షేక్ స్పియర్ నాటకాలను పోలిన అంశాలతో

షేక్ స్పియర్ నాటకాలను పోలిన అంశాలతో

ఈ చిత్ర కథ షేక్ స్పియర్ రచించిన కామేడి ఆఫ్ ఎర్రర్స్, ట్వెల్త్ నైట్ నాటకాల్లో మాదిరిగా ఒకరిని బదులు మరొకరిని టార్గెట్‌గా చేసుకొనే అంశాన్ని (మిస్టేకెన్ ఐడెంటీటీస్) పోలి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఓ ప్రదేశంలో ఎదురైన సమస్యలను ఓ వ్యక్తులు ఎలా ఎదురించారనేది కథాంశం.


ప్రధాన పాత్రధారులు


చిత్రం పేరు: నగరం
నటీనటులు: సందీప్ కిషన్, శ్రీ, రెజీనా కసాండ్రా, మధుసూదన్, చార్లే
దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్
సంగీత దర్శకుడు: జావెద్ రియాజ్,
సినిమాటోగ్రాఫర్: సెల్వకుమార్ ఎస్కే,
ఎడిటర్: ఫిలోమిన్


English summary
Lokesh Kanagaraj’s debut work Nagaram movie gearing up to release on 10 March. Sandeep Kishan, Regina, Shri are lead roles in this movie. Before release this movie grabs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu