»   » ఆ సినిమాతో మెగా హీరోకి సంబంధం లేదు: గెస్ట్ రోల్ కథలన్నీ రూమర్లే

ఆ సినిమాతో మెగా హీరోకి సంబంధం లేదు: గెస్ట్ రోల్ కథలన్నీ రూమర్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయి ధరమ్ తేజ్ నక్షత్రం లో చేసిన గెస్ట్ రోల్ ఎఫెక్ట్ నుంచే ఇంకా బయటపడలేదు. అంతలోనే రవితేజ చేస్తున్న "రాజా ది గ్రేట్" మూవీ లో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడంటూ న్యూస్ బయటికి రావటంతో పాపం ధరమ్ తేజ్ కి ఇంకా ఙ్ఞానోదయం కాలేదా అనుకున్నారంతా. అయితే రాజా ది గ్రేట్ సినిమా సెట్స్ మీద టీమ్ అందరితో కలిసి సెల్ఫీల్లో కనిపించిన తేజూ ఆ సినిమాలో రోల్ చేస్తున్నాడనే వార్తలు కేవలం రూమర్లే అని తేలిపోయింది.

స్వయంగా ఈ సినిమా దర్శకుడు అనీల్ రావి పూడి ఈ రూమర్‌కి తెర దింపేసాడు. రాజా ది గ్రేట్ లో రాశీ ఖన్నా తప్ప మరెవరూ అథితి పాత్రల్లో నటించలేదనీ, కేవలం ఫ్రెండ్లీగా సెట్స్ మీదకి వచ్చిన తేజూ సరదాగా సెల్ఫీలకి ఫోజ్ ఇవ్వటం తో అతను కూడా నటిస్తున్నాడన్న అపార్థం చోటు చేసుకుందనీ చెప్పేసాడు.

 Sai Dharam Tej Special Appearance in Raja the Great Movie is a Rumour

దాంతో మన మెగా చిన్నోడు పొరపాటు చేయలేదన్న విషయం అభిమానులకి అర్థమైపోయింది... తిక్క', 'విన్నర్', 'నక్షత్రం' చిత్రాలతో వరుస ప్లాఫులను అందుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. దాంతో ఇతగాడు ఇప్పుడు తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ 'జవాన్'పైనే పెట్టుకున్నాడు.

 Sai Dharam Tej Special Appearance in Raja the Great Movie is a Rumour

రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ బి.వి.ఎస్. రవి తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. దీంతో దసరా కానుకగా ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఈ సినిమా దసరా బరిలో నిలవడం లేదు! సో ఇక ఈ సినిమాలో అథితి పాత్రలో కనిపిస్తున్నాడనగానే నమ్మేసారంతా. ఈ సంగతి పక్కన పెడితే చాలా ఫ్లాపుల తర్వాత, ఇంకా చాలా గ్యాప్ తర్వాత రవితేజా చేస్తున్న ఈ సినిమా మీద చాలా ఆశలే ఉన్నాయి మన మాస్ మహారాజాకి. కనీసం ఈ సినిమా తో అయినా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు.

English summary
Sai Dharam Tej Special Appearance in Raja the Great Movie is a Rumour, Says Director Anil Ravipudi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu