»   » నక్షత్రం మూవీ రివ్యూ: నక్షత్రాలు కనిపించడం ఖాయం

నక్షత్రం మూవీ రివ్యూ: నక్షత్రాలు కనిపించడం ఖాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

RATING : 1.75 / 5

గులాబీ, అంతపురం, మురారీ లాంటి అద్భుతమైన చిత్రాలు కృష్ణవంశీని స్టార్ డైరెక్టర్‌ను చేశాయి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. చాలా కాలంగా కృష్ణవంశీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో యువ నటులు సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌తో జతకట్టి హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. సమాజానికి వెలకట్టలేని సేవలందిస్తున్న పోలీసు కథను తన చిత్రానికి నేపథ్యంగా ఎంచుకొన్నారు. పోలీసు అంటే హనుమంతుడు అనే బ్రహ్మండమైన మాటతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాడు. గతంలో ఎన్నడూలేని విధంగా రెజీనా, ప్రగ్యా అందాల ఆరబోతకు సిద్ధమయ్యారనే విషయం ప్రోమో చిత్రాల ద్వారా అర్థమైంది. ఇలాంటి అనేక అంశాలతో ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నక్షత్రం సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


నక్షత్రం కథ ఇలా..

నక్షత్రం కథ ఇలా..

పోలీసుశాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరాలన్నది రామారావు (సందీప్ కిషన్) జీవిత లక్ష్యం. మామ కూతురు జమున ( రెజీనా)తో ప్రేమలో ఉంటాడు. రామారావు ఇంటిలో మూడు తరాల వారు పోలీసుశాఖలో సేవలందిస్తూ రావడమే ఆయన లక్ష్యం వెనుక ఉన్న స్ఫూర్తి. ఎస్ఐ ఉద్యోగం కోసం నానా కష్టాలు పడి చివరికి ఉద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకొంటాడు. ఆ క్రమంలో ఓ సంఘటన కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందలేకపోతాడు. తన తల్లి కన్న కల నిజం కాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. ఆ సమయంలో సీతారాం (శివాజీరాజా) కాపాడి.. పోలీసు ఉద్యోగం పొందలేకపోయినా పర్వాలేదు. ఈ పోలీసు డ్రెస్ వేసుకొని పౌరుడిగా బాధ్యత నెరవేర్చు అని చెప్పి అలెగ్జాండర్ నేమ్ ప్లేట్ ఉన్న డ్రస్‌ను ఇస్తాడు.


Krishna Vamshi Condemned Allegation which Targetted by few Heros
క్లైమాక్స్‌కు చేరుకునేందుకు...

క్లైమాక్స్‌కు చేరుకునేందుకు...

అలెగ్జాండర్ డ్రస్ వేసుకొని పోలీసు ఉద్యోగం చేస్తుండగా ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ ఇనెస్విగేషన్‌లో అలెగ్జాండర్ పేరుతో డ్రస్ వేసుకొని ఉన్న రామారావు కనిపిస్తాడు. అప్పటివరకు పోలీస్ శాఖ వెతుకుతున్న ఐపీఎస్ అధికారి అలెగ్జాండర్ ( సాయి ధరమ్ తేజ్) డ్రస్ వేసుకొని ఉన్న రామారావును పట్టుకొచ్చి ఇంటారాగేషన్ చేస్తారు. అలెగ్జాండర్ ఎక్కడ ఉన్నాడు? అలెగ్జాండర్‌ను ఏమి చేశావు లాంటి ప్రశ్నలతో చితకబాదుతారు. ఇంతకీ ఐపీఎస్ అలెగ్జాండర్ ఏమైపోయాడు. ప్రగ్యా జైస్వాల్‌కు అలెగ్జాండర్‌కు సంబంధం ఏమిటి? కమిషనర్ (ప్రకాశ్ రాజ్), ఆయన కొడుకు (తనీష్) కథకు సంబంధమేమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే నక్షత్రం సినిమా కథ.


ఫస్టాఫ్..

ఫస్టాఫ్..

రామారావుగా సందీప్ కిషన్ పోలీసు ఉద్యోగం పొందడానికి పడిన కష్టాలను, సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణించాలనే కోరిక ఉన్న జమున (రెజీనా) ఇతర పాత్రల పరిచయంతో సినిమా గడిచిపోతుంది. డ్రగ్స్ అలవాటు పడిన తనీష్ విలనిజం, మాఫియా కార్యక్రమాలతో అలా ఇంటర్వెల్ వరకు సినిమాను దర్శకుడు కృష్ణవంశీ బలవంతంగా లాక్కొస్తాడు. ఇక ఇంటర్వెల్‌లో అలెగ్జాండర్ పాత్రను తీసుకొచ్చి ప్రేక్షకులకు ఓ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో రెండో భాగంలో అలెగ్గాండర్ పాత్రపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించడంలో కృష్ణవంశీ తన ప్రతిభను చూపాడు.


సెకండాఫ్..

సెకండాఫ్..

తీరా సెకండాఫ్ మొదలైన తర్వాత కథ చాలా పేలవంగా సాగడం, సన్నివేశాలు, డైలాగ్స్‌లో దమ్ము లేకపోవడంతో సినిమా పరిస్థితి ఏంటో అప్పుడే తేలిపోతుంది. తనీష్ విలనిజం కాస్త కొత్తగా అనిపించడం సెకండాఫ్‌లో కొంత ఊరటలా ఉంటుంది. ఫస్టాఫ్‌లోను, సెకండాఫ్‌లోను రొటీన్ ఫార్మూలాతో విసుగు పెట్టించాడు దర్శకుడు. కథ ఏం చెప్పాలనుకొంటున్నాడో ఓ పట్టాన అర్థం కాదు. ఎంత సేపు పాత్రల చుట్టూ.. అనవసరంగా మధ్యలో పాటలను జొప్పించి సినిమాను చాలా నాసిరకంగా చుట్టేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. 24 విభాగాల్లో ఏ ఒక్క విభాగం ప్రతిభ ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ఈ సినిమా పరిస్థితికి అద్దం పట్టింది. ఓవరాల్‌గా రెజీనా, ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోత, కొంతలో కొంత తనీష్ విలన్ పాత్ర ప్రేక్షకుడికి ఊరటను కలిగిస్తాయి.


కృష్ణవంశీ పనితీరు..

కృష్ణవంశీ పనితీరు..

నక్షత్రం సినిమాలో కృష్ణవంశీ టాలెంట్, మేకింగ్ దీపం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించదు. పోలీస్ కథ అంటే బలమైన సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనేది ప్రేక్షకులకు బలమైన నమ్మకం. ఈ సినిమాలో అలాంటివి మచ్చుకైనా ఎక్కడా కనిపించవు. చాలా సాదాసీదా స్క్రిప్ట్‌తో కృష్ణవంశీ పెద్ద సాహసమే చేశాడు. అనవసరమైన ఫైట్లు, కథకు బలం చేకూర్చే సన్నివేశాలు లేకుండానే సక్సెస్ సిద్ధమయ్యాడా అనే భావన కలుగుతుంది. ఒకప్పుడు మంచి సినిమాలు ఎలా తీయాలి అనే ప్రశ్నకు కృష్ణవంశీ కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం చెత్త సినిమాలు ఎలా తీయకూడదో అనే అంశానికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఓ ఉదాహరణ అనే ఫిలింగ్ కలుగుతుంది. నక్షత్రం విషయానికి వస్తే అన్ని విభాగాల్లోను కృష్ణవంశీ విఫలమయ్యాడని చెప్పవచ్చు.


సందీప్ కిషన్ డిఫరెంట్‌గా..

సందీప్ కిషన్ డిఫరెంట్‌గా..

రామారావుగా సందీప్ కిషన్‌కు మంచి పాత్ర లభించిందని చెప్పవచ్చు. పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు అనే విషయం కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇంకా హోంవర్క్ చేసి ఉంటే సందీప్‌లో ఓ స్టార్ కాకుండా మంచి నటుడు ఉన్నాడనే ప్రశంస లభించి ఉండేది. కథలో ఉండే వేరియషన్స్ వల్ల సందీప్ పాత్రకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. అయినా తన పాత్ర పరిధి మేరకు సందీప్ మంచి నటననే కనబరిచాడు.


పోలీస్ అధికారి పాత్రలో సాయి ధరమ్

పోలీస్ అధికారి పాత్రలో సాయి ధరమ్

పవర్ ఫుల్ పోలీస్ అధికారి అలెగ్జాండర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించాడు. పేరుకే పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది. విడుదలకు ముందు ఆ పాత్రకు లభించిన ప్రచారాన్ని చూస్తే తెర మీద అంతగా కనిపించదు. ప్రకాశ్ రాజ్ చేరదీసిన ఓ అనాథగా, పోలీస్ ఆఫీసర్‌గా సాయికి ఈ రోల్ ఒకరకంగా డిఫరెంటే కానీ. ఆ పాత్ర ఎలివేట్ కావడానికి బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల అంతగా ఇంప్టాక్ కనిపించదు. ప్రగ్యా జైస్వాల్‌తో చేసిన రొమాన్స్ సీన్లు బాగా పండాయి.


గ్లామర్‌ తారగా రెజీనా హాట్ హాట్

గ్లామర్‌ తారగా రెజీనా హాట్ హాట్

జమున పాత్రలో రెజీనా ఓ డాన్సర్‌గా కనిపించింది. సినిమాల్లో కోరియోగ్రాఫర్ కావాలని ప్రయత్నిస్తున్న క్రమంలో షూటింగ్‌లో ఎదురైన చేదు అనుభవాలు, ఇతర సన్నివేశాల్లో రెజీనా నటన ఆకట్టుకొంటుంది. చాలా సన్నివేశాల్లో చాలా హాట్ హాట్‌గా కనిపించింది. ఆ పాత్రకు ఓ దిశానిర్ధేశం లేకపోవడంతో గ్లామర్‌కే పరిమితమైంది.


ప్రగ్యా అందాలు అదుర్స్

ప్రగ్యా అందాలు అదుర్స్

కంచె, నమో వెంకటేశాయ నమః చిత్రంలో చాలా లక్షణంగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌ ఒక్కసారిగా ప్రేక్షకులకు షాకిచ్చింది. సంప్రదాయ పాత్రలకే పరిమితమవుతుందా అనే సమయంలో తనలోని అందాలను యదేచ్ఛగా నక్షత్రంలో ప్రగ్యా ఆరబోసింది. సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ పాటలో ప్రేక్షకులకు అందాల స్వర్గాన్ని చూపించిదనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ద్వారా తనలో మంచి గ్లామర్ హీరోయిన్‌ ఉందనే సంకేతాలను దర్శక, నిర్మాతలకు చెప్పకనే చెప్పింది.


తెర మీద కొత్తగా తనీష్

తెర మీద కొత్తగా తనీష్

తనీష్‌ను ఇప్పటివరకు హీరోగానే చూశాం. నక్షత్రం చిత్రంలో ఓ కొత్త తనీష్‌ను కృష్ణవంశీ ఆవిష్కరించాడు. తనీష్‌లో మరో కోణం ఉందనే విషయం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసింది. సెకండాఫ్‌లో తనీష్ యాక్టింగ్ ప్లస్ పాయింట్. ఇంకా తనీష్ పాత్ర మీద దృష్టి పెట్టి ఉంటే తన నుంచి మరింత నటనను రాబట్టుకొవడానికి అవకాశాలున్నాయనిపించింది. ఏదీ ఏమైనా కెరీర్‌లో తనీష్‌కు ఓ టర్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.


నాసిరకంగా ఫొటోగ్రఫీ

నాసిరకంగా ఫొటోగ్రఫీ

కృష్ణవంశీ సినిమా అంటే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా కనిపిస్తుంది. కథ, కథనం ఎలా ఉన్నా ఫ్రేములు చాలా అందంగా కనిపిస్తాయి. ప్రేక్షకుడికి ఓ అనుభూతిని కలిగిస్తాయి. అయితే నక్షత్రం సినిమాలో మాత్ర కెమెరా పనితనం చాలా నాసిరకంగా కనిపిస్తుంది. ఇది కృష్ణవంశీ సినిమానే అనే అనుమానం కలిగించేలా ఉంటుంది.


ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్

ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్

నక్షత్రం సినిమాకు ఎడిటింగ్ మరో మైనస్ పాయింట్. సాధారణంగా కృష్ణవంశీ సినిమాల్లో సీన్లు చకచకా పరుగులు పెడుతుంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం సీన్లు దమ్ము కనిపించదు. ఈ సినిమాలో అనవసరమైన సీన్లే ఎక్కువ గొడవ చేశాయి. ఇంకా ఓపిక ఉంటే చాలా సన్నివేశాలపై కత్తెర వేయడానికి అవకాశం ఉంది.


నామమాత్రంగా మారిన ప్రకాశ్ రాజ్

నామమాత్రంగా మారిన ప్రకాశ్ రాజ్

జనరల్‌గా కృష్ణవంశీ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఈ సినిమాలో కథ చుట్టు ప్రకాశ్ తిరగడం కనిపిస్తుంది. కమిషనర్‌గా ప్రకాశ్ రాజ్ కనిపించాడు. చివరి సీన్లో తప్ప ఈ సినిమాపై ఆయన ప్రభావం ఉందనే భావన ఎక్కడ అనిపించదు. ప్రకాశ్ రాజ్ పాత్ర కథకు కేంద్ర బిందువు అయినప్పటికీ.. అంత ఇంపాక్ట్ ఉన్నట్టు కనిపించదు. సీతారాం పాత్రలో శివాజీరాజాకు ఓ మంచి పాత్ర లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.


తెరవెనుక.. తెర ముందు..

తెరవెనుక.. తెర ముందు..

నటీనటులు: నక్షత్రం, కృష్ణవంశీ, సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా కసండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్‌రాజ్, తనీష్
కథ, దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: కే శ్రీనివాసులు, ఎస్ వేణుగోపాల్, సజ్జు
సంగీతం: మణిశర్మ భీమ్స్ సెసిరోలే, హరి గోవ్రా
బ్యానర్: శ్రీ చక్ర మీడియా బుట్టబొమ్మ క్రియేషన్
రిలీజ్ డేట్: 2017 ఆగస్టు 4


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
రెజీనా, ప్రగ్యా గ్లామర్
సాయి ధరమ్ తేజ్, సందీప్
తనీష్ విలనిజం


నెగిటివ్ పాయింట్స్
కథ, కథనం
కెమెరా
మ్యూజిక్
ఎడిటింగ్
ఇంకా చాలా..


మెరిసిన శ్రీయా.. అతిథి పాత్రలో జేడీ చక్రవర్తి

మెరిసిన శ్రీయా.. అతిథి పాత్రలో జేడీ చక్రవర్తి

శ్రీయా సరన్ ఓ ఐటమ్ పాటలో మెరిసింది. శ్రీయ వేసిన స్టెప్పులు బాగా ఉన్నాయి. హోమంత్రిగా రామచంద్ర నాయుడు పాత్రలో జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు కనిపించాడు. ఈ రెండు పాత్రల వల్ల సినిమాకు ఒరిగేదేమీ ఉండదు. సీతారాం పాత్రలో శివాజీరాజాకు ఓ మంచి పాత్ర లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.


English summary
Nakshatram is a action film written and directed by Krishna Vamsi. Jointly produced by K. Srinivasulu, S. Venugopal and Sajju, it features an ensemble cast of Sundeep Kishan, Regina Cassandra, Sai Dharam Tej, Pragya Jaiswal, Prakash Raj, J. D. Chakravarthy, and Tanish. This movie is released on 4 August 2017
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu