X
తెలుగు » సినిమాలు » నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

Comedy | Romance | 16 Dec 2016 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ స్టోరీ

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భాస్కర్ బండి నిర్వహించారు మరియు బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు.  కథ రాఘవరావు (రావు రమేష్)కు లేక లేక కలిగిన సంతానం పద్మావతి (హెబ్బా పటేల్). కూతరంటే రాఘవరావుకు ప్రాణం. జాతకాలను నమ్మే రాఘవరావు .... జాతకాల ప్రకారం తండ్రీ కూతుళ్లకి అస్సలు పడదని పురోహితడు చెప్పడంతో.... ముందు నుండీ జాగ్రత్తగా ఉంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురికి నచ్చినట్లే తాను నడుచుకుంటూ పెంచుతాడు. పెళ్లీడు రావడంతో పద్మావతికి పెళ్లి చేయాలని డిసైడ్ అయిన రాఘవరావు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉంటలాడు. అయితే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం కాకుండా తాను ఇష్టపడ్డవాడినే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న పద్దూ.... తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు అబద్దం చెబుతుంది. ఆ తర్వాత ముగ్గురు ఓ అబ్బాయిల్లో తనకు సెట్టయ్యేవాడిని సెలక్ట్ చేసుకోవాలని భావిస్తుంది. దీనికి తండ్రి ఎలా స్పందించాడు, చివరకు పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది... తర్వాత జరిగే స్టోరీ.
Read More

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ కాస్ట్ & క్రూ

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భాస్కర్ బండి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత బెక్కెం వేణుగోపాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాలో హైలెట్ అయింది తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్. సినిమాకు ఆయన నటనే ప్రధాన బలం. కూతురు భవిష్యత్తు బావుండాలని తపించే తండ్రి పాత్రలో జీవించాడు. రావు రమేష్ లేకుండా సినిమా చూడలేం అనే ఫీలింగ్ కలిగించాడు. హెబ్బ పటేల్ తన బబ్లీ పెర్ఫార్మెన్స్, క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. రావు రమేష్ తర్వాత సినిమాలో ఆకట్టుకునే క్యారెక్టర్ హెబ్బ పటేల్. బాయ్ ఫ్రెండ్స్ పాత్రల్లో అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఈ ముగ్గురిలో పార్వతీశం తన కామెడీ టైమింగుతో కాస్త బెటర్ అనిపించాడు. కథలో కొత్తదనం ఏమీ లేదు. గతంలో వచ్చిన చుక్కల్లో చంద్రుడు మూవీ కాన్సెప్టు ఇందులో వాడానే ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లిని తప్పించుకోవడానికి హీరోయిన్ ప్రేమలో పడ్డట్లు బద్దం చెప్పడం... తర్వాత ముగ్గురిని ఎంచుకుని వారిలో తనకు తగిన వాడిని ఎంచుకోవాలనే కాన్సెప్ట్ రొటీన్ గా అనిపిస్తుంది. సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే యూత్ కు నచ్చే యావరేజ్ టైమ్ పాసింగ్ మూవీ. రావు రమేష్ పాత్ర ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+