X
తెలుగు » సినిమాలు » ఓ పిట్టకథ
ఓ పిట్టకథ

ఓ పిట్టకథ

Romance | 06 Mar 2020 | U | 128 Mins
Telugu

2.8 /5 Users

2.5 /5 Filmibeat

ఓ పిట్టకథ స్టోరీ

ఓ పిట్టకథ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వాంత్, సంజయ్ రావు, నిత్య శెట్టి, బ్రహ్మాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చందు ముద్దు వహించారు. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ప్రవీన్ లక్కరాజు అందించారు.  కథ కాకినాడలో ఓ థియేటర్‌ యజమాని కూతురు వెంకటలక్ష్మీ ఉరఫ్ వెంకీ (నిత్యాశెట్టి). తల్లిలేని బిడ్డ కావడంతో గారాబంగా పెరుగుతుంది. తమ థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్ రావు)తో చనువుగా ఉంటుంది. అదే సమయంలో చైనా నుంచి కాకినాడలో అడుగుపెట్టిన మేన బావ క్రిష్ (విశ్వంత్)‌కు దగ్గరవుతుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో వెంకటలక్ష్మీ కిడ్నాప్‌కు గురి అవుతుంది. ఆ క్రమంలో ప్రభు, క్రిష్‌లపై అనుమానాలు రేకెత్తుతాయి. దాంతో ఇన్స్‌పెక్టర్ అజయ్ రావు (బ్రహ్మాజీ) రంగంలోకి దిగుతాడు. వెంకటలక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇష్టంగా ప్రేమించే ప్రభు, క్రిష్‌పై ఎందుకు అనుమానాలు కలుగుతాయి? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి అసలు కారణమేమిటి? అజయ్ రావు చేసే దర్యాప్తు ఎలా సాగింది? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసిన వారిని ఎలా గుర్తించారు? వెంకటలక్ష్మి క్షేమంగా తిరిగి వచ్చిందా? క్రిష్, ప్రభులో ఎవరు వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఓ పిట్టకథ.
Read More

ఓ పిట్టకథ కాస్ట్ & క్రూ

ఓ పిట్టకథ సిబ్బంది సమాచారం

దర్శకత్వం చందు ముద్దు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓ పిట్టకథ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సస్సెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో రూపొందిన ప్రేమ కథా చిత్రం ఓ పిట్టకథ. కొత్త తారలు, దర్శకుడు కలయికలో వచ్చిన ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. కథలో ఊహించని మలుపుల ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగించే విధంగా ఉంటాయి. తొలి భాగం రొటీన్‌గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెదడుకు పదునుపెట్టేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ లభిస్తే... మంచి విజయాన్ని సొంతం చేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఓ పిట్టకథ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

ఓ పిట్టకథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+