X
తెలుగు » సినిమాలు » ఓదెల రైల్వేస్టేషన్
ఓదెల రైల్వేస్టేషన్

ఓదెల రైల్వేస్టేషన్

Action | Romance | 26 Aug 2022 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఓదెల రైల్వేస్టేషన్ స్టోరీ

ఓదెల రైల్వేస్టేషన్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వసిష్ఠ ఎన్ సింహ, హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ తేజ వహించారు. నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. ఈ సినిమాకి కథ సంపత్ నంది అందించారు.  కథ నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ కథ ప్రారంభంలోనే ఒళ్లు జలదరింపజేస్తుంది. ఓ స్త్రీ ఒంటినిండా బురదతో, చేతిలో మొండెం లేని తలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతుంది. ఆమెను ఆ విధంగా చూసిన గామస్థులు, పోలీసులు జడుసుకున్నట్లుగానే ప్రేక్షకులు కూడా ఒకింత భయపడతారు. ఇక కథలోకి వెళితే, ఓదెల అనే ప్రాంతంలో వరుసగా నవ వధువులందరూ హత్యకు గురవుతుంటారు. పెళ్లైన మరుసటి రోజే అమ్మాయిలను అపహరించి అతి కిరాతకంగా హత్య చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. అదే ప్రాంతానికి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన ఐపీఎస్ అధికారి అనుదీప్ ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అదే ఊరికి చెందిన జంట రాథిక, తిరుపతి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ వరుస హత్యల నడుమ వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. అసలు నేరస్థుడు ఎవరు? ఐపీఎస్ అనుదీప్ ఈ వరుస హత్యలను ఆపగలిగాడా లేదా అన్నది అసలు కథ. 
Read More

ఓదెల రైల్వేస్టేషన్ కాస్ట్ & క్రూ

ఓదెల రైల్వేస్టేషన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశోక్ తేజ
స్టోరీ సంపత్ నంది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓదెల రైల్వేస్టేషన్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
క్రైమ్ థ్రిల్లర్ లు అంటే సూటిగా సుత్తిలేకుండానే ఉండాలి. అప్పుడే కిక్ ఉంటుంది. అదే సూత్రాన్ని నమ్ముకుని ఈ సినిమాను సింపుల్ గా గంటన్నర నిడివిలో పూర్తి చేశారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది రాసుకున్న కథను అశోక తేజ తెరకెక్కించారు. టెక్నికల్ పరంగా సినిమా క్వాలిటీ సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇక్కడ సినిమాటోగ్రాఫర్ సౌందర రాజన్ కు మంచి మార్కులు పడాల్సిందే. సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు యాప్ట్ గా సరిపోయింది. అయితే డైరెక్టర్ కథ చెప్పిన విధానంలో కొన్ని లోటు పాట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పాత్రల క్యారెక్టరైజేషన్ పై మరి కాస్త వర్కౌట్ చేసి ఉంటే మరింత బాగుండేది. ముఖ్యంగా బోల్డ్ సీన్ల డోస్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

ఓదెల రైల్వేస్టేషన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓదెల రైల్వేస్టేషన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+