X
రోగ్

రోగ్

Action | Romance | 31 Mar 2017 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రోగ్ స్టోరీ

రోగ్ (మరో చంటిగాడి ప్రేమ కథ) సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఇషాన్, ఏంజెలా క్రిస్లింజ్కి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు మరియు జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ బ్యానర్ పై డాక్టర్ సి ఆర్ మనోహార్, సి ఆర్ గోపి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునిల్ కౌష్యఫ్ స్వరాలు సమకుర్చరు. కథ చంటి (ఇషాన్) రఫ్ టఫ్ యువకుడు. కమిషనర్ చెల్లెలు అంజలి (ఏంజెలా), ఇషాన్ ప్రేమించుకొంటారు. కానీ కమిషనర్ తన చెల్లెలిని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ అధికారి (సుబ్బరాజు)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. ఇది తెలుసుకొన్న చంటి కమిషనర్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. ఎదురొచ్చిన పోలీసులను చావబాదుతాడు. ఆక్రమంలో ఓ కానిస్టేబుల్ (సత్య) తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలోకి వెళ్తాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ చనిపోతాడు. ఆ ఘటనకు బాధ్యుడైన చంటికి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తుంది. చంటి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టాల్లో ఉన్న కానిస్టేబుల్ కుటుంబం గురించి తెలుసుకోని వారికి అండగా నిలబడాలనుకొంటాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ చెల్లెలు అంజలి (మన్నారా చోప్రా) ప్రేమలో పడుతాడు. కానీ అంజలిని ఓ సైకో ( అనూప్ సింగ్ ఠాకూర్) వెంటపడి వేధిస్తాడు. ప్రేమించమని బలవంతం పెడుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో సైకో, చంటికి మధ్య జరిగిన ప్రేమ యుద్ధం ఎక్కడికి దారి తీసింది. సైకో బారిన పడిన అంజలిని చంటి ఎలా దక్కించుకొన్నాడు. కానిస్టేబుల్ కుటుంబానికి మేలు చేయడానికి చంటి ఏం చేశాడు. కమిషనర్ చెల్లెలు చంటిని ఎందుకు వదులుకొన్నదనే ప్రశ్నలకు సమాధానం రోగ్ సినిమా.  
Read More

రోగ్ కాస్ట్ & క్రూ

రోగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సునీల్ కశ్యప్
నిర్మాత సి ఆర్ మనోహర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రోగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మంచి ఫిజిక్ ఉన్న ఇషాన్, ఏంజెలా, మన్నారా చోప్రాల మధ్య లవ్ సీన్స్‌ను ఎప్పటిలానే తనదైన శైలిలో చిత్రీకరించి తన మార్కును పూరి నిలబెట్టుకొన్నాడు. పూరి ప్రేమకథల్లో ఫీల్ అనేది కీలకమైన అంశం. అయితే ఆ ఫీల్ అనేది రెండు ప్రేమ కథల్లోనూ పూరి స్థాయిలో కనిపించకపోవడం కొంత నిరాశ పరిచే అంశం. ‘దరిద్రం వదిలి పోతుంటే వెంటపడకూడదు'. ‘వాడి భార్య గురించి వాడికే తెలియదు' లాంటి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. రెగ్యులర్ పూరి సినిమాల్లో కనిపించే పంచులు పూర్తి స్థాయిలో కనిపించలేదు. లవ్ సీన్లలో ఫీలింగ్ కంటే శృంగారమే మితి మీరింది. నాసిరకమైన సీన్లతో చాలా వేగంగా చుట్టేశాడనే భ్రమ కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. కానీ కథలో భాగమై అదనపు బలంగా మారడానికి అవి తోడ్పాటునందిస్తాయా అనేది ప్రశ్నార్థకమే. మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్‌తో విడుదలకు ముందే ఆకట్టుకొన్న పూరి.. ఇడియట్ చిత్రానికి దారిదాపుల్లోకి కూడా వెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. ఈ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకొని రోగ్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రిప్టు విషయంలో మితి మీరిన విశ్వాసంతో నేల విడిచి సాము చేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా రోగ్‌లో పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్, లవ్ సీన్లు సరిగా పండలేదనే చెప్పవచ్చు. రోగ్ ఓ సాదాసీదా చిత్రమనే భావన కలుగడం ఖాయం.

రోగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రోగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+