»   » ‘హే భగవాన్’ అసలేం చేస్తున్నావ్ పూరీ!?

‘హే భగవాన్’ అసలేం చేస్తున్నావ్ పూరీ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దానికంటే ముందే కొత్త హీరో ఇషాన్ తో రోగ్ సినిమా చేశాడు. ఆ సినిమా ఇవాలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన పూరి ఓ ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించాడు.

బాలకృష్ణ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏంటో చెప్పేశాడు. ఏకంగా దేవుడి మీదే సినిమా తీస్తాడట. అంటే అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిలా కనిపించినట్టు కాదు. నేటి కాలంలో దేవుళ్ల వల్ల ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందలు వస్తున్నాయో చూపించబోతున్నట్టు పూరీ తెలిపాడు. దానికి టైటిల్‌ను కూడా కన్ఫర్మ్ చేసేశాడు ఈ డాషింగ్ డైరెక్టర్. 'హే భగవాన్' అని టైటిల్ పెట్టాడు. ఈ కాన్సెప్ట్‌తో గతంలోనూ గోపాల..గోపాల వంటి సినిమాలు వచ్చినా..

Puri jagannadh new movie title " Hey Bhagavan "

హే భగవాన్ డిఫరెంట్‌గా సాగిపోతుందట. పూరీ పెన్ పవర్ ఎలా ఉంటుందో తెలిసిందే. పంచులతో సాగిపోయే పూరీ తరహా డైలాగులు.. ఈ సినిమాలోనూ బోలెడు ఉంటాయట. ఈ సినిమా కాన్సెప్ట్ వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. దేవుళ్ల వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టం గురించి ఈ సినిమాలో చూపిస్తానని 'పూరీ' ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. ఇతర భాషల్లో దేవుళ్లపై చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో 'పీకే'..'ఓ మై గాడ్' వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి 'పూరి' సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
After Balayya101, Puri Jagannath will be filming 'Hey Bhagwan'. He wants to show how the World has been suffering because of Gods in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu