»   » ఎలాంటి ఫీలింగ్ లేని రోగ్ (రోగ్ మూవీ రివ్యూ)

ఎలాంటి ఫీలింగ్ లేని రోగ్ (రోగ్ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ నుంచి హార్ట్ ఎటాక్ వరకు ప్రేమ కథలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో క్రేజి డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ది ప్రత్యేకమైన శైలి. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా డైలాగ్స్, స్టైల్‌ను మేళవించి సినిమాలు తీస్తారనే పేరు పూరి సొంతం. తాజాగా ఇషాన్ అనే కుర్రాడిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం రోగ్ మార్చి 31 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఎంజెలా హీరోయిన్స్. పక్కా యూత్, లవ్, యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే.

ప్రేమ కథ.. హత్య.. జైలు..

ప్రేమ కథ.. హత్య.. జైలు..

చంటి (ఇషాన్) రఫ్ టఫ్ యువకుడు. కమిషనర్ చెల్లెలు అంజలి (ఏంజెలా), ఇషాన్ ప్రేమించుకొంటారు. కానీ కమిషనర్ తన చెల్లెలిని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ అధికారి (సుబ్బరాజు)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. ఇది తెలుసుకొన్న చంటి కమిషనర్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. ఎదురొచ్చిన పోలీసులను చావబాదుతాడు. ఆక్రమంలో ఓ కానిస్టేబుల్ (సత్య) తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలోకి వెళ్తాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ చనిపోతాడు. ఆ ఘటనకు బాధ్యుడైన చంటికి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తుంది.


జైలు నుంచి వచ్చిన తర్వాత..

జైలు నుంచి వచ్చిన తర్వాత..

చంటి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టాల్లో ఉన్న కానిస్టేబుల్ కుటుంబం గురించి తెలుసుకోని వారికి అండగా నిలబడాలనుకొంటాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ చెల్లెలు అంజలి (మన్నారా చోప్రా) ప్రేమలో పడుతాడు. కానీ అంజలిని ఓ సైకో ( అనూప్ సింగ్ ఠాకూర్) వెంటపడి వేధిస్తాడు. ప్రేమించమని బలవంతం పెడుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో సైకో, చంటికి మధ్య జరిగిన ప్రేమ యుద్ధం ఎక్కడికి దారి తీసింది. సైకో బారిన పడిన అంజలిని చంటి ఎలా దక్కించుకొన్నాడు. కానిస్టేబుల్ కుటుంబానికి మేలు చేయడానికి చంటి ఏం చేశాడు. కమిషనర్ చెల్లెలు చంటిని ఎందుకు వదులుకొన్నదనే ప్రశ్నలకు సమాధానం రోగ్ సినిమా.


ఫీలింగ్ మిస్..

ఫీలింగ్ మిస్..

మంచి ఫిజిక్ ఉన్న ఇషాన్, ఏంజెలా, మన్నారా చోప్రాల మధ్య లవ్ సీన్స్‌ను ఎప్పటిలానే తనదైన శైలిలో చిత్రీకరించి తన మార్కును పూరి నిలబెట్టుకొన్నాడు. పూరి ప్రేమకథల్లో ఫీల్ అనేది కీలకమైన అంశం. అయితే ఆ ఫీల్ అనేది రెండు ప్రేమ కథల్లోనూ పూరి స్థాయిలో కనిపించకపోవడం కొంత నిరాశ పరిచే అంశం. ‘దరిద్రం వదిలి పోతుంటే వెంటపడకూడదు'. ‘వాడి భార్య గురించి వాడికే తెలియదు' లాంటి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. రెగ్యులర్ పూరి సినిమాల్లో కనిపించే పంచులు పూర్తి స్థాయిలో కనిపించలేదు.


మతిమీరిన శృంగారం, వయోలెన్స్

మతిమీరిన శృంగారం, వయోలెన్స్

లవ్ సీన్లలో ఫీలింగ్ కంటే శృంగారమే మితి మీరింది. నాసిరకమైన సీన్లతో చాలా వేగంగా చుట్టేశాడనే భ్రమ కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. కానీ కథలో భాగమై అదనపు బలంగా మారడానికి అవి తోడ్పాటునందిస్తాయా అనేది ప్రశ్నార్థకమే. మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్‌తో విడుదలకు ముందే ఆకట్టుకొన్న పూరి.. ఇడియట్ చిత్రానికి దారిదాపుల్లోకి కూడా వెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. ఈ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకొని రోగ్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రిప్టు విషయంలో మితి మీరిన విశ్వాసంతో నేల విడిచి సాము చేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా రోగ్‌లో పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్, లవ్ సీన్లు సరిగా పండలేదనే చెప్పవచ్చు. రోగ్ ఓ సాదాసీదా చిత్రమనే భావన కలుగడం ఖాయం.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
పూరి డైరెక్షన్
సినిమాటోగ్రఫీ
పర్వాలేదనిపించే ఫస్టాఫ్


నెగిటివ్ పాయింట్స్
పాటలు
కథనం
రొటీన్ స్టోరి
సెకండాఫ్తెర మీద.. తెర వెనుక

తెర మీద.. తెర వెనుక

నటీనటులు: ఇషాన్‌ (తొలి పరిచయం), మన్నారా చోప్రా, ఏంజెలా, పోసాని కృష్ణమురళి, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌, సుబ్బరాజు, ఆలీ తదితరులు
సినిమాటోగ్రఫీ : ముఖేష్‌
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
ఎడిటింగ్: జునైద్‌
నిర్మాతలు: సిఆర్‌ మనోహర్‌, సిఆర్‌ గోపి
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
రిలీజ్ డేట్: 31మార్చి 2017


చంటిగాడు భేష్..

చంటిగాడు భేష్..

చంటిగాడుగా కనిపించిన ఇషాన్‌కు రోగ్ తొలి చిత్రం. ఫైట్స్‌లోనూ, ప్రేమ సన్నివేశాల్లోనూ ఎక్కడ తడబాటు కలిగించలేదు. ప్రతి సన్నివేశంలోనూ కొత్త హీరో అనే భావన ప్రేక్షకుడికి జాగ్రత్త పడ్డాడు. ఆకట్టుకునే రూపం, నటన‌లో ఈజ్ ఇషాన్‌కు అదనపు ఎసెట్. మంచి కథ పడి ఉంటే ఓ రేంజ్ హీరో అనే ట్యాగ్ వచ్చేది. రొటీన్ కథ కారణంగా పూర్తిస్థాయిలో ఇషాన్‌ చూడలేకపోయామనే ఫీలింగ్ కలుగుతుంది.


అందాల ఆరబోతలు పోటాపోటి..

అందాల ఆరబోతలు పోటాపోటి..

ఏంజెల్ పాత్ర పరిమితమైనా ఉన్నంత సేపు అందంతో దడదడలాడించింది. మన్నారా చోప్రా అందాల ఆరబోత బాగానే ఉన్నా నటనలో ఇంకా పరిణతి కనిపించలేదు. తెలుగులో ఇది మూడో చిత్రమైనా ఇంకా కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. గ్లామర్‌ తారగా రాణించాలంటే ఇంకా అందంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో పాటలు, డాన్సులతో పని కానిచ్చేసింది. టాప్ హీరోయిన్ల రేసులోకి రావాలంటే ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంకా శ్రమించాల్సిందే.


ఇతర పాత్రలు పరిధి మేరకు..

ఇతర పాత్రలు పరిధి మేరకు..

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా సుబ్బరాజు కనిపించాడు. పాత్రలో ఆవేశం తప్పా సెన్సిబుల్‌గా బిహేవ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. వడ్డీ వ్యాపారిగా పోసానికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ప్రొఫెషనల్ బిచ్చగాడి పాత్ర ప్రయోగం వికటించింది. పోకిరి కొనసాగింపుగా కనిపించే బిచ్చగాడు పాత్రలో ఆలీ తన మార్కును చూపించలేకపోయాడు. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ బోర్ కొట్టించాడు.


అనూప్ సింగ్ మరోసారి విజృంభణ

అనూప్ సింగ్ మరోసారి విజృంభణ

విలన్‌గా అనూప్ సింగ్ ఠాకూర్ మరోసారి తెలుగు తెరపై మెరిశాడు. సింగం3, విన్నర్ చిత్రాల తర్వాత అనూప్‌కు ఇది మూడో చిత్రం. మంచి పాత్ర పడితే దుమ్ము రేపే సామర్థ్యం అతనిలో ఉంది. టాలీవుడ్‌లో స్టార్ విలన్‌ హోదాను సంపాదించుకోవాలంటే మరో సినిమా దాకా వేచి చూడాల్సిందే. ఇషాన్‌కు పోటాపోటీగా నటించి తన ప్రతిభను చాటుకొన్నాడు.


తేలిపోయిన సంగీతం..

తేలిపోయిన సంగీతం..

పూరి ప్రేమ కథలకు సంగీత, పాటలు ప్రాణమని గత చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. అయితే లవ్ స్టోరికి తగినట్టుగా బాణీలు అందించడంలో సునీల్ విఫలమయ్యాడు. పూరి ఆడియో అంటే కనీసం రెండు మూడు పాటలైనా థియేటర్ బయటకు వచ్చాక వెంటాడేలా ఉంటాయి. ఆ ఫీలింగ్ ఈ సినిమాలో మిస్ అయింది.


అదరగొట్టిన ముఖేష్ కెమెరా

అదరగొట్టిన ముఖేష్ కెమెరా

ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రఫీని అందించాడు. అందమైన లోకేషన్లను అద్భుతంగా చిత్రీకరించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ విషయంలోనూ అదరగొట్టాడు. ఈ సినిమాకు ముఖేష్ అదనపు బలం. బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే ముఖేష్ ప్రతిభ మరింత కనిపించేదేమో.


పూరి మరింత దృష్టి

పూరి మరింత దృష్టి

కథ ఎలా ఉన్నా తన మార్కు ఎక్కడా మిస్ అవకుండా స్క్రిన్ ప్లే అందించడంలో పూరి జగన్నాధ్ దిట్ట. అతి సాధారణమైన కథను కూడా అసాధారణ రీతిలో తెరకెక్కించిన సందర్బాలు ఉన్నాయి. రోగ్ విషయంలో పూర్తి స్థాయిలో వర్కవుట్ చేయలేదనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. కథ, కథనంపై మరింత జాగ్రత్త పడి ఉంటే రోగ్ చిత్రం మరో హిట్‌గా పూరి ఖాతాలో చేరి ఉండేదేమో.


English summary
Rogue is a Telugu – Kannada bilingual action thriller film directed by Puri Jagannadh. The film introduces Ishan in the lead role, along with Mannara Chopra and Angela Krislinzki playing the female leads. This movie hits theates on 31 march 2017
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu