»   » పూరి కెరీర్లోనే దారుణం, ఇండస్ట్రీలో ఇపుడు ఇదే హాట్ టాపిక్!

పూరి కెరీర్లోనే దారుణం, ఇండస్ట్రీలో ఇపుడు ఇదే హాట్ టాపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో హిట్లు, ప్లాపులు అనేవి సర్వసాధారణం. ఇండస్ట్రీలో టాప్ హీరోలైనా, టాప్ దర్శకులైనా పలు సందర్భాల్లో గెలుపోటములు స్వీకరించక తప్పదు. అయితే ఇలాంటి స్టార్ డమ్ ఉన్న దర్శకులకు లేదా హీరోలకు అత్యంత దారుణమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే.... అది తమ సినిమా చూడటానికి ప్రేక్షకులు కనీసం థియేటర్ వరకు కూడా రాక పోవడం.

తాజాగా పూరి జగన్నాథ్ తన కెరీర్లోనే బాక్సాఫీసు వద్ద అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడం ఇపుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. పూరి దర్శకత్వంలో గత వారం రిలీజైన 'రోగ్' సినిమా బాక్సాఫీసు వద్ద చాలా దీనమైన స్థితిలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తేల్చేసాయి.

నాలుగు రోజుల్లో కేవలం $338

నాలుగు రోజుల్లో కేవలం $338

యూఎస్ బాక్సాఫీసు వద్ద అయితే ‘రోగ్' పరిస్థితి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని రీతిలో ఉందని, ఈ సినిమా అక్కడ తొలి నాలుగు రోజుల్లో కేవలం $338 మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్.

ఫెయిల్

ఫెయిల్

ఒక స్టార్ డైరెక్టర్... తన సినిమాలో పెద్ద స్టార్స్ లేక పోయినా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగే సత్తా కలిగి ఉండాలి. ‘రోగ్' విషయంలో పూరి తన ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ నడుస్తోంది.

రెమ్యూనరేషన్ భారీగా

రెమ్యూనరేషన్ భారీగా

‘రోగ్' సినిమాకు పూరి రెమ్యూనరేషన్ భారీగానే తీసుకున్నారట. ఎంత తీసుకున్నారనేది కచ్చితంగా బయటకు రాలేదు. రూ. 10 కోట్ల వరకు ఆయనకు అందాయని టాక్. అదే నిజమైతే సినిమా ఫుల్ రన్ లో పూరికి ఇచ్చిన 10 కోట్ల మేరకైనా రికవరీ అవుతుందా? అనే సందేహం అందరినీ తొలిచేస్తోంది.

బాలయ్యతో సినిమా

బాలయ్యతో సినిమా

పూరి ప్రస్తుతం బాలయ్య 101వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. పూరి ‘రోగ్' ప్రభావం బాలయ్య సినిమా బిజినెస్ మీద పడుతుందా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

English summary
Rogue movie USA first weekend collections just $338. Rogue is an Indian Telugu - Kannada bilingual action thriller film directed by Puri Jagannadh.The film introduces Ishan in the lead role, along with Mannara Chopra and Angela Krislinzki playing the female leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu