»   »  పూరీతో సినిమా ఆగిపోయిందా..? వెనకడుగు వేసిన వెంకీ

పూరీతో సినిమా ఆగిపోయిందా..? వెనకడుగు వేసిన వెంకీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచి మాస్ స్టోరీతో ఒక్క సారి మళ్ళీ మాస్ ఫాలోయిమంగ్ ని పెంచుకుందామనుకున్న వెంకీ పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని తన మార్కెట్‌ రేట్‌కి మించిన బడ్జెట్‌ ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. నిర్మాతలు ముందుకు రాకపోతే తానే నిర్మాతగా మారాలని కూడా అనుకున్నాడు. అయితే సురేష్‌బాబు అడ్డు చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ ముందుకి కదల్లేదు. ఈలోగా పూరి జగన్నాథ్‌ వెళ్లి బాలకృష్ణకి ఇంకో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఒకరకంగా ఆ సినిమా తప్పిపోవటం మంచిదే అయ్యిందనుకుంటున్నాడట వెంకటేష్...

రోగ్‌' డిజాస్టర్‌గా నిలిచింది

రోగ్‌' డిజాస్టర్‌గా నిలిచింది

ఎన్నో ఆశలతో మళ్ళీ పాత పూరీని చూపిస్తుందనుకున్న సినిమా ‘రోగ్‌' డిజాస్టర్‌గా నిలిచింది. ఎంత డిజాస్టర్‌ అయినా పూరి సినిమా అంటే మినిమమ్‌ కలెక్షన్స్‌ ఉంటాయి. ఈ సినిమాకు కనీసం ప్రేక్షకాదరణ కూడా లేనట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పూరి దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నాడట.

అవమానమే.

అవమానమే.

ఈ సినిమా ఫుల్‌రన్‌లో కనీసం పది కోట్ల రూపాయల షేర్‌ కూడా తెచ్చుకోలేదని వార్తలు వినబడుతున్నాయి. అంటే పూరి తీసుకున్న రెమ్యునరేషన్‌ కూడా రికవర్‌ కాదన్నమాట. ఓవర్సీస్‌లో అయితే మరీ దారణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ డైరెక్టర్‌గా పూరికి ఇది అవమానమే.

రోగ్‌ రిలీజ్‌ అయిన తర్వాత

రోగ్‌ రిలీజ్‌ అయిన తర్వాత

వెంకీతో కూడా సినిమా చేస్తానంటూ పూరి చెబుతున్నాడు కానీ రోగ్‌ రిలీజ్‌ అయిన తర్వాత వెంకీ ఆలోచన మారిందని అంటున్నారు. గురుతో పాటే రిలీజ్‌ అయిన రోగ్‌ దారుణమైన ఓపెనింగ్‌ తెచ్చుకోవడంతో పాటు డిజాస్టర్‌ టాక్‌తో నడుస్తూ వుండడంతో ఈ టైమ్‌లో పూరి జగన్నాథ్‌తో సినిమా చేయడం, అందునా భారీ బడ్జెట్‌తో ప్రయోగం చేయడం సరికాదని వెంకటేష్‌ డిసైడ్‌ అయిపోయాడట.

 తేజ డైరెక్షన్‌లో

తేజ డైరెక్షన్‌లో

పూరితో కంటే తేజ డైరెక్షన్‌లో చేయడం బెటరని అనుకుంటున్నాడట. తేజ తనకోసం ఏదో కథ సిద్ధం చేసాడని తెలిసి అతడిని రమ్మని కబురంపించాడట... బాలయ్య సినిమా హిట్‌ అయితే అప్పుడు మళ్లీ పూరితో వెంకీ సినిమా తెర మీదకి వస్తుందేమో కానీ ప్రస్తుతానికి అది డ్రాప్‌ అయిపోయినట్టే.

English summary
Here is the latest update from industry, the two most talented persons of the industry Hero victory venkatesh Drops his Movie Plans With Puri Jagannadh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu