For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas:ప్రభాస్ కు అవమాననం, అందుకు వాళ్ల సపోర్ట్.. నెట్ ఫ్లిక్స్ పై ఫ్యాన్స్ యుద్ధం!

  |

  దివంగత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి సినిమాలతో సూపర్ పాపులర్ అయ్యాడు. ఇక జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా ఎనలేని పేరు తెచ్చుకున్నాడు. దీంతో ప్రభాస్ ఆ సినిమా తర్వాత ప్రతి మూవీని పాన్ ఇండియాగా ప్లాన్ చేశాడు. తాజాగా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ను అవమానించింది. దీనికి బాలీవుడ్ అగ్ర హీరో అభిమానులు సపోర్ట్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి నెట్ ఫ్లిక్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

   ప్రపంచవ్యాప్తంగా మార్కెట్..

  ప్రపంచవ్యాప్తంగా మార్కెట్..

  అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. దర్శక ధీరుడు రాజమౌళి తరెకెక్కించిన బాహుబలి సినిమాతో ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. అంతేకాకుండా ఆయన మార్కెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో తర్వాతి ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే తీసుకొచ్చాడు డార్లింగ్ ప్రభాస్. దీంతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా సినిమా ఆడియెన్స్ కు దగ్గర అవుతున్నాడు.

  గ్లోబల్ స్టాయిలో..

  గ్లోబల్ స్టాయిలో..

  సినిమా హిట్ అయినా ప్లాప్ అయిన ఈ మిస్టర్ పర్ ఫెక్ట్ క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా ప్రభాస్ గురించి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ కాస్త ప్రభాస్ అభిమానులకు ఎక్కడాలేని కోపం తెచ్చింది. 'బాహుబలి: కంక్లూజన్' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో నటించిన సినిమా సాహో. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్ తోపాటు పలువురు హిందీ నటులు కూడా నటించారు. ఈ సినిమా హిందీలో పాటు నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ స్థాయిలో ఉంది.

  షారుక్ ఖాన్ ఫ్యాన్స్ సపోర్ట్

  షారుక్ ఖాన్ ఫ్యాన్స్ సపోర్ట్

  అయితే ఇటీవల ప్రభాస్ సాహో చిత్రం నుంచి ఒక క్లిప్ ను షేర్ చేసింది 'నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా'. షేర్ చేస్తే సరిపోయేది కానీ దానికి 'ఇదేం యాక్షన్' అని ఇండోనేషియాలో రాసుకొచ్చింది. దాన్నిట్రాన్స్ లేట్ చేసి చదివినా వారికి వ్యంగంలా కనిపించింది. దీంతో ప్రభాస్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ పై తెగ ఫైర్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా ట్వీట్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు.

  నెట్ ఫ్లిక్స్ పై యుద్ధం..

  సాహోలో ప్రభాస్ కొండపైనుంచి దూకి పారాషూట్ బ్యాగ్ పట్టుకునే వీడియోపై సెటైర్లు వేశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమాలోని సీక్వెన్స్ బయట కూడా చేస్తారని, దాన్ని బంజాయ్ స్కై డైవింగ్ అంటారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే దీనంతటికి కారణమైన నెట్ ఫ్లిక్స్ పై యుద్ధం ప్రకటించారు ప్రభాస్ అభిమానులు.

  బ్యాన్ చేయాలని డిమాండ్..

  బ్యాన్ చేయాలని డిమాండ్..

  ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్ స్క్రైబ్ చేసుకోవాలని, బ్యాన్ చేయాలని ట్రెండ్ తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే UnsubscribeNetflix, BanNetflix హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్లలో నెట్ ఫ్లిక్స్ యాప్ ను డిలీట్ చేసి వాటి స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తున్నారు. 2019లో వచ్చిన సాహో చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

  సినిమాటిక్ లిబర్టీ..

  అయితే సాహో సినిమా ఎంతో కష్టపడి చేసిన సినిమా. యాక్షన్ పరంగా ఇండియన్ స్టాండర్స్ ను అది ఎంతగానో పెంచిందని, కొన్ని చోట్లు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఉండొచ్చని, ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లోనూ చూడొచ్చని, అలాంటిది ప్రభాస్ సినిమాను టార్గెట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మొత్తంగా ఒక్క ట్వీట్ తో ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లేనిపోని సమస్య తెచ్చుకుందని తెలుస్తోంది.

  English summary
  Prabhas Fans Make #UnsubscribeNetflix And #BanNetflix Trend For Netflix Indonesia Commenting On Saaho Clip Satirically.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X