శౌర్య స్టోరీ
శౌర్య సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, రెజీనా కసాండ్ర, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సయాజి షిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి., ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, సత్యప్రకాష్ ,సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్, చంద్రకాంత్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దసరధ్ నిర్వహించారు మరియు నిర్మాత మల్కపురం శివ కుమర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వెద్ స్వరాలు సమకుర్చారు. కథ శౌర్య(మంచు మనోజ్), నేత్ర (రెజీనా) ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ పెళ్లికి నేత్ర తండ్రి, పార్లమెంటు సభ్యుడు సత్యమూర్తి (నాగినీడు), బాబాయ్ కృష్ణమూర్తి(సుబ్బరాజు) అడ్డుపడటంతో పెళ్లి చేసుకుని యూకె వెళ్లి సెటిలవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే మొక్కు చెల్లించడం కోసం నేత్ర తన ఊరికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ నేరం శౌర్య మీద పడుతుంది. ఈ కేసు నుండి శౌర్య ఎలా బయట పడ్డాడు? అసలు నేత్రపై హత్యాయత్నం చేసింది ఎవరు? వారిని పట్టించడానికి శౌర్య ఏం చేసాడు? అనేది మిగతా కథా.
Read More