Just In
- 26 min ago
లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
- 41 min ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
- 1 hr ago
టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ: త్వరలోనే భారీ సర్ప్రైజ్.. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ!
- 2 hrs ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
Don't Miss!
- Automobiles
మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం
- News
తిరుమలలో పవన్ కల్యాణ్: శ్రీవారి దర్శనం: కాస్సేపట్లో ప్రెస్‌మీట్: తిరుపతి బరిపై ఉత్కంఠత
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుష్క, సావిత్రిని కలిపి వాడేశారు.. కార్తీక దీపం వంటలక్క క్రేజ్‌కు నిదర్శనమిదే
కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇంకా చేస్తుందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క సీరియల్, టీఆర్పీతో చానెల్ మొత్తం రన్ అవుతుందంటేనే దాని సత్తా ఏటో తెలిసిపోతోంది. హీరోల సినిమాల కంటే ఎక్కువ టీఆర్పీని తెచ్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ సీరియల్ అంతగా పాపులర్ అవ్వడానికి ఎన్నో కారణాలున్నాయి. దీప, వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ అద్భుతమైన నటన అందులో ముఖ్య కారణం.

కట్టూబొట్టూ..
కార్తీకదీపం సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్ నటన అంతా ఒకెత్తు అయితే ఆమె కట్టూ బొట్టూ ఒకెత్తు. ఆ చీరకట్టు, నుదుటున సింధూరం, తెలుగు మహిళకు చిహ్నాంగా ఉండే ఆ రూపం.. ఇలా ఎన్నెన్నో కారణాలున్నాయి. వీటన్నింటితో ప్రేమీ విశ్వనాథ్ తెలుగు మహిళలకు ప్రతీరూపంగా మారింది. అందుకే ప్రేమీ విశ్వనాథ్‌కు ఎనలేని క్రేజ్ వచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
ప్రేమీ విశ్వనాథ్.. బయటి ఈవెంట్లలో ఎక్కువగా కనిపించదు. కేవలం కార్తీక దీపం సీరియల్‌లో మాత్రమే కనిపిస్తుంది. బయట ప్రకటనలు, మరేతర సీరియళ్లలోనూ నటించదు. ఒకే ఒక్క సారి అది కూడా దసరా ఈవెంట్ కోసం ప్రేమీ విశ్వనాథ్ బయటకు వచ్చింది. అయితే ప్రేమీ విశ్వనాథ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

అసలు రూపమిదే..
కార్తీక దీపం సీరియల్ చూసిన వారు.. సోషల్ మీడియాలో ప్రేమీ విశ్వనాథ్‌ను చూసి వారు కచ్చితంగా షాక్ అవుతారు. ఆమె ఈమె ఒక్కరేనా అని అనుకునేలా ఉంటుంది. అల్ట్రా మోడ్రన్ స్టైలీష్‌గా ప్రేమీ విశ్వనాథ్ కనిపిస్తుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఆ మధ్య అలా..
సోషల్ మీడియాలతో యాక్టివ్‌గా ఉండే ప్రేమీ విశ్వనాథ్ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఆ మధ్య ఐపీఎస్ సీజన్ ప్రారంభం అవ్వడంతో కార్తీక దీపం సీరియల్ చూడలేకపోతున్నాం అంటూ నిరాశ చెందిన అభిమానికి సర్ ప్రైజ్ ఇస్తూ ఓ టీవీని పంపించింది ప్రేమీ విశ్వనాథ్. ఆ సమయంలో ప్రేమీపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఇలా..
అరుంధతి సినిమాలో అనుష్క ఓ డైలాగ్ చెబుతుంది. తొలిచూరు బిడ్డకు నా పేరు పెట్టండి.. మళ్లీ నేనే పుట్టాను అని అనుకోండి.. నాకు ఇచ్చిన గౌరవమే ఆమెకు కూడా ఇవ్వండి అని అనుష్క చెప్పే డైలాగ్‌ను మహానటి సావిత్రి, ప్రేమీ విశ్వనాథ్‌ను పోల్చుతూ ఓ మీమ్ క్రియేట్ చేశారు. దాన్ని ప్రేమీ విశ్వనాథ్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.