X
వివేకం

వివేకం

Action | Romance | 25 Aug 2017 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

వివేకం స్టోరీ

వివేకం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజిత్ కుమార్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్, వివేక్ ఒబెరాయ్, అరవ్ చౌదరి, కరుణాకరన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జె శివ కుమార్ వహించారు  మరియు నిర్మాత త్యాగరాజన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.  కథ అజయ్ కుమార్(అజిత్) ఇంటర్నేషనల్ స్పై ఏంజెంట్. ఎలాంటి ప్రమాదకరమైన టాస్క్ అయినా విజయవంతంగా పూర్తి చేయగల వీరుడు. అదే ఏజెన్సీలో పని చేసే ఆర్యన్(వివేక్ ఒబెరాయ్) మరికొందరు అజయ్‍‌కి ప్రాణ స్నేహితులు. అంతా కలిసి ప్రపంచానికి ముప్పుగా మారిన క్రిమినల్స్‌ను అంతమొందిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ అత్యంత ప్రమాదకరమైన ఫ్లూటోనియం వెపన్స్ దొంగిలిస్తుంది. వాటి ద్వారా కృత్రిమంగా భూకంపాలు సృష్టించి ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేది వారి ప్లాన్. ఆ క్రిమినల్స్ ఆటకట్టించేందుకు అజయ్ రంగంలోకి దిగి వాటిని పేల్చడానికి ఉపయోగించే సీక్రెట్ కోడ్ ఉన్న డివైజ్ స్వాధీనం చేసుకుంటారు. ఇంతలోనే అజయ్‍‌కి ఊహించని షాక్ ఎదురవుతుంది. తను ప్రాణ స్నేహితులుగా నమ్మిన ఆర్యన్, మరో ఇద్దరు స్నేహితులు క్రమినల్ గ్యాంగ్‌తో చేతులు కలిపి తనను వెన్నుపోటు పొడిచి తన వద్ద నుండి ఆ కోడ్ ఉన్న డివైజ్ ఎత్తుకెళతారు. తనను ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా చిత్రీకరిస్తాడు. ఇండియాలో బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. మరి అజయ్ వారి ఆట ఎలా కట్టించాడు, వారిపై తన రివేంజ్ స్టోరీ ఎలా సాగింది అనేది తర్వాతి కథ.
Read More

వివేకం కాస్ట్ & క్రూ

వివేకం సిబ్బంది సమాచారం

దర్శకత్వం జె శివ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత త్యాగరాజన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వివేకం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అజిత్ లాంటి పెద్ద హీరో, అందుకు తగిన విధంగా భారీ సెటప్, హాలీవుడ్ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయగల టెక్నీషియన్స్, అదిరిపోయే యాక్షన్ సన్నిశాలు ఇలా దర్శకుడు అన్నీ భారీగానే సెట్ చేసుకున్నాడు కానీ..... అత్యంత ముఖ్యమైన కథ, కథనాన్ని సరిగా సెట్ చేసుకోలేక పోయాడు. రొటీన్ యాక్షన్, రివేంజ్ డ్రామాలా సినిమా నడిపించాడు. సినిమా మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా ప్రతి సీన్లోనూ యాక్షన్, తుపాకుల మోతతో థియేటర్ దద్దరిల్లిపోయింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు సైతం భరించలేనంత యాక్షన్ ఓవర్ డోస్ ఉండటం పెద్ద మైనస్. సినిమాలో యాక్షన్ పార్టు ఎక్కువగా ఉండటంతో ఇతర భావోద్వేగాలను కమ్మేసింది. అజిత్, కాజల్ మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేక పోయారు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఏమీ లేవు. ఇది ప్రేక్షకులను నిరాశ పరిచే అంశమే.

వివేకం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వివేకం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+