»   » ఎవ్వడూ నిన్ను గెలవలేడు: అజిత్ ‘వివేకం’ తెలుగు టీజర్ అదుర్స్!

ఎవ్వడూ నిన్ను గెలవలేడు: అజిత్ ‘వివేకం’ తెలుగు టీజర్ అదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళస్టార్ అజిత్ తమిళంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ తెలుగులో 'వివేకం' పేరుతో విడుదల కాబోతోంది. తాజాగా తెలుగు టీజర్ విడుదలైంది. అజిత్ కుమార్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని... తెలుగులో శౌర్యం, శంఖం, దరువు చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఈ లోకమే నిన్ను ఎదురించినా... పరిస్థితులు అన్నీ నీవు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కించినా... నువ్వుగా ఒప్పుకునే వరకు ఎవ్వడూ ఎక్కడా ఎప్పుడూ నిన్ను గెలవలేడు' అంటూ అజిత్ డైలాగ్ చెబుతూ విడుదల చేసిన టీజర్ తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచింది.ట్రైలర్ అన్నీ బాగుండటంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీంతో సినిమా ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.


సుమారు రూ.4.50 కోట్లకు ఈ హక్కులు అమ్ముడయినట్లు సమాచారం. అజిత్ కేరీర్లో ఇప్పటి వరకు తెలుగులో ఇదే బెస్ట్ డీల్. పెట్టిన ఈ మొత్తాన్ని చూస్తుంటే చిత్రం భారీ ఎత్తున రిలీజయ్యేలా కనిపిస్తోంది. తమిళంతో పాటే తెలుగు వెర్షన్ కూడా ఆగష్టు 10వ తేదీన రిలీజ్ కానుంది. టిజి. త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.


English summary
Vivekam, Kajal Aggarwal starrer official telugu teaser released. Vivegam is an upcoming Tamil-language Indian spy thriller film co-written and directed by Siva. It features Ajith Kumar, Vivek Oberoi, Kajal Aggarwal and Akshara Haasan. Principal photography of the film commenced at Slovenia in August 2016 and the movie is scheduled for a worldwide release on 10 August 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu