»   » అజిత్ ‘వివేకం’ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే....

అజిత్ ‘వివేకం’ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అజిత్ సినిమా థియేటర్లోకి చాలా రోజులైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 'వివేకం' సినిమాతో ఆయన బాక్సాఫీసు రేసులో జాయిన్ అయ్యారు. తనకు గతంలో వీరమ్, వేదాలం లాంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు శివతో కలిసి చేసిన మూడో సినిమా ఇది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రలో నటించాడు. కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ ఈ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

వివేకం

వివేకం

‘వివేకం' మూవీ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజిత్ ఆర్మీమెన్ గా నటించారు. అజిత్, అతడి ఫ్రెండ్ గ్యాంగ్‌లోని సభ్యులు వివేక్ ఒబెరాయ్, అక్షర హాసన్ తదితరులు యూరప్‌లో ఓ సీక్రెట్ మిషన్ మీద పని చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ అజిత్ భార్య పాత్రలో నటించింది. తన దేశాన్ని రక్షించుకునే పాత్రలో అజిత్ నటించారు.

భారీ హైప్

భారీ హైప్

వివేకం సినిమాకు ప్రీ రిలీజ్ హైప్ బాగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. తమిళనాడులో ఈ చిత్రం రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేశారు.

పబ్లిక్ టాక్

పబ్లిక్ టాక్

సినిమాలో యాక్షన్ సీన్లు బావున్నాయని, అజిత్ వన్ మెన్ షో అని అంటున్నారు. అభిమానులకు ఈ సినిమా ఓకే అనేలా ఉన్నప్పటికీ, మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో విసుగు చెందిన భావన కలిగిందని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

హాలీవుడ్ స్థాయిలో

హాలీవుడ్ స్థాయిలో

సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారనే ప్రశంసలు అభిమానులు వెల్లువెత్తుతున్నాయి. అయితే కామన్ ఆడియన్ ఈ మాటతో ఏకీభవిస్తున్నప్పటికీ సినిమా సంతృప్తి పరచలేదని అంటున్నారు.

English summary
After a gap of close to two years, Ajith has returned to the silver screen with Vivekam. He has collaborated with Siruthai Siva for the third time after being part of successful outings like Veeram and Vedalam. The film has Kajal Aggarwal playing the female lead while Bollywood actor Vivek Oberoi plays a key role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu