»   » సూపర్ రేటు: 'ఎవడే సుబ్రహ్మణ్యం' శాటిలైట్ అమ్మారు

సూపర్ రేటు: 'ఎవడే సుబ్రహ్మణ్యం' శాటిలైట్ అమ్మారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంక దత్ స్వప్న సినిమా పతాకం నిర్మించిన చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. నాని హీరో. మాళవికా నాయర్‌ హీరోయిన్. ఈ చిత్రం కొన్ని కోజుల క్రితం విడుదల చేశారు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ...బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలచింది. ఇప్పుడీ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ రోజుల్లో శాటిలైట్ రైట్స్ సినిమా బిజినెస్ లో కీలకమై నిలుస్తున్నాయి. శాటిలైట్ బిజినెస్ తో చాలా చిన్న సినిమాలు లాభాల బాటలో పడుతున్నాయి. తాజాగా ఈ చిత్రం కూడా జెమినీ వారు 3.90 కు సొంతం చేసుకోవటంతో లాభం పొందినట్లే అయ్యింది.

చిత్రం కథేమిటంటే....

"లైఫ్ లో నువ్వు ఎవరూ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ తోనే తెలుస్తుంది " అనేది మనసా వాచా నమ్మి అనుసరిస్తున్న వాడు సుబ్రమణ్యం(నాని)అలియాస్ సుబ్బు. ఇలాంటి వర్కోహాలిక్ కు ఇంకా చెప్పాలంటే కెరిర్ ఓరియెంటెడ్ కుర్రాడికి రిషి(విజయ్ దేవరకొండ) అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. రిషిది క్వయిట్ ఆపోజిట్ మనస్వత్వం.. జీవితం ఉన్నది అనుభవించటానికి, ఆనందించటానికి అనేది అతని ఫిలాసఫి. ఈ క్రమంలో సుబ్బు తను నమ్మి ఆచరిస్తున్న సిద్దాంతంతో ఓ కార్పోరేట్ కంపెనీకు సీఈవో గా ఎదుగుతాడు. అంతేకాదు అతనికి రితు వర్మ తో ఎంగేజ్ మెంట్ సైతం అవుతుంది.

Nani's Yevade Subramanyam satellite rights sold

ఈ లోగా ఓ రోజు అతన్ని గోవానుంచి రిషి ...తన స్నేహితురాలు ఆనందిని(మాళవిక నాయిర్) తో సహా వచ్చి కలుస్తాడు. అంతేకాదు రిషి అతన్ని ... తనకు అత్యంత ఇష్టమైన హిమాలయాలలోని రిషికేష్ దగ్గరలోని ధూథ్ కాశి వెళ్దామని బలవంటపెడతాడు. సుబ్బు దానికి ఒప్పుకోడు. అయితే ఓ అనుకోని పరిణామంతో అక్కడికి ఆనందినితో కలిసి బయిలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి అసలు జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. ఇంతకీ ఆ ఊహించని సంఘటన ఏమిటి.. ఇంతకీ ఆనందిని అసలు కథేంటి...సుబ్బుని జీవితం అంటే తెలుసుకునేలా చేసిన పరిస్ధితులు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నాని మాట్లాడుతూ...చాలాసార్లు అనిపించేది. ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువయ్యేవి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగొచ్చేటప్పుడు కలిగిన సంతోషం మాత్రం మాటల్లో వర్ణించలేను. ఈ సినిమాకోసం హిమాలయాలు ఎక్కేటప్పుడు దారిలో ఎక్కడ పడితే అక్కడ పడుకొనేవాళ్లం. ఆ ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఈ సినిమా చూశాక అందరూ మనమేంటన్నది ఓసారి ఎవరికి వాళ్లు మననం చేసుకొంటారు.

నాగ్‌ అశ్విన్‌ కథ చెప్పిన విధానం, ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. తనని నమ్మి ఈ చిత్రాన్ని చేసినందుకు గర్వంగా ఉంది. స్వప్నదత్‌, ప్రియాంక దత్‌ ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం అద్భుతం అనే చెబుతా అని అన్నారు.

English summary
Nani’s recent film ‘Evade Subrahmanyam’ satellite rights has been sold for Gemini TV for a fancy price of Rs.3.90 crs.
Please Wait while comments are loading...