లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న యువ హీరో సుధాకర్ కోమాకుల ఇటీవల నువ్వు తోపురా చిత్రంతో అలరించారు. అయితే గత ఏడాది ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా తన భార్య హరిక సందెపోగుతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో య్యూట్యూబ్‌లో వైరల్ అయింది. స్వయంగా చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేసి సుధాకర్ దంపతులను అభినందించారు.
ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాటకు వారిద్దరు కలిసి వేసిన స్టెప్పులు.. పాటలో వారిద్దరి కెమిస్ట్రీ చాలా ఆకట్టుకొన్నది అంటూ మెగాస్టార్ ప్రశంసించారు. అయితే ఆ సమయంలో సుధాకర్ దంపతులు అమెరికాలో ఉండటం వల్ల వ్యక్తిగతంగా వారిని అభినందించలేకపోతున్నాను అంటూ చిరంజీవి తన వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్‌లో ఉన్న సుధాకర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ను స్వయంగా ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు అందుకొన్నారు.
ఈ సందర్బంగా సుధాకర్ దంపతులను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. ఇందువదన పాటని వైరల్ చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించారు. అలాగే తన సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుందని చిరంజీవి చెప్పడంతో వారి ఆనందం ఆకాశానికి అంటింది.
చిరంజీవిని కలిసిన తర్వాత సుధాకర్ దంపతులు మాట్లాడుతూ.. మెగాస్టార్‌ను కలవడం తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలుగా మిగిలిపోతాయి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా, బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉన్న కొత్త తరాన్ని నిస్స్వార్ధంగా ఉత్సాహపరిచే తన వ్యక్తిత్వాన్ని మెగాస్టార్ మరోసారి చూపించారు అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
Actor Sudhakar Komakula and his wife Harika Sandepogu met Megastar Chiranjeevi garu at his residence, wished him Happy New year and took his best wishes. Chiranjeevi garu invited the couple to his house and shared his happiness about the viral Induvadana song. He also wished Sudhakar for his future endeavors and extended his support. Couple expressed their gratitude, extreme happiness and felt this special day would be the most memorable day of their lives.