Just In
- 21 min ago
ఉగాదికి అలా రంజాన్‌కు ఇలా.. పూనమ్ కౌర్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్స్
- 1 hr ago
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- 2 hrs ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 10 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
Don't Miss!
- Sports
KKR vs MI: ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు.. ఈ విజయం బౌలర్లదే: రోహిత్
- Finance
హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే
- News
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎం
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Ye Zindagi Lyrical Song: ఆకట్టుకుంటోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సాంగ్
చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. అప్పటి నుంచి హిట్‌ను మాత్రం దక్కించుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు అక్కినేని వారసుడు అఖిల్. కెరీర్ మొత్తంలో మూడు సినిమాల్లో నటించిన అతడు.. ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న దర్శకుడు భాస్కర్‌తో జత కట్టాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలోని పాట తాజాగా విడుదలైంది.
టాలెంటెడ్ డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. కొద్ది సేపటి క్రితం ఈ సినిమాలోని 'ఏ జిందగీ' అని సాగే ఓ పాట విడుదలైంది. గోపీ సుందర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. హనియా నఫీషా, గోపీ సుందర్ ఈ గీతాన్ని ఆలపించారు. ఎంతో హాయిగా సాగే ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా మ్యూజిక్‌తో పాటు కొన్ని విజువల్స్ బాగున్నాయి. అలాగే, ఫీమేల్ సింగర్ వాయిస్ కూడా వినసొంపుగా ఉంది. మొత్తంగా ఈ పాట అదరగొట్టేస్తుంది.

అక్కినేని అఖిల్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ఈషా రెబ్బా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు. ఇది జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.