Don't Miss!
- News
లోకేష్ నుంచి చంద్రబాబు కోరుకుంటుంది ఇదే
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సైలెంట్ గా నిశ్చితార్థం రెహమాన్ కుమార్తె.. అబ్బాయి ఎవరో తెలుసా?
ప్రముఖ భారతీయ చలనచిత్ర సంగీత స్వరకర్త AR రెహమాన్ గత మూడు దశాబ్దాలుగా సంగీత రంగాన్ని పరిపాలిస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు కాగా ఖతీజా రెహమాన్ పెద్ద కుమార్తె. అలాగే ఆయనకు రహీమా రెహమాన్ అనే మరో కుమార్తె అమీన్ రెహమాన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

బురఖా విషయంలో
నిజానికి 2020లో, రచయిత్రి తస్లీమా నస్రీన్ బురఖా విషయంలో చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో బుర్ఖా ధరించడంపై చేసిన వ్యాఖ్యలు మీడియాలో హల్చల్ చేశాయి. బురఖా ధరించడం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ సంప్రదాయాలు కొందరు పెట్టడం, వాటిపై జడ్జిమెంట్లు ఇబ్బందికరంగా ఉంటాయి.

మహిళలపై చాలా ఆంక్షలు
కానీ నాకు బురఖా ధరించడం అత్యంత ఇష్టం అంటూ ఖతీజా వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మహిళలపై చాలా ఆంక్షలు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలనే టార్గెట్ చేయడం దారుణం అని ఆమె అన్నారు. కులాలు, హోదాలను కూడా పట్టించుకోకుండా టార్గెట్ చేస్తుంటారు. కొందరు పని లేని వాళ్ళు మా లాంటి వాళ్ళ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫరిస్థాన్ ఆల్బమ్ రిలీజ్
ఇటీవల తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మీరు బుర్ఖాలో కనిపించే అరుదైన సింగర్ అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ హాలీవుడ్‌లో మార్షమెల్లో తనకు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ ఆమెను ఎవరూ పట్టించుకోరు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తుంటారు అని ప్రశ్నించారు. ఇక ఆమె తాను రూపొందించిన ఫరిస్థాన్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌కు తండ్రి రెహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తే.. మున్నా షేక్ షౌకత్ అలీ సాహిత్యం అందించారు.

డిసెంబర్ 29న
ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రపంచానికి తన కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఖతీజా మరియు రియాస్దీన్ డిసెంబర్ 29న కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.

పెళ్లి తేదీ త్వరలో
పెళ్లి
తేదీని
ఇరు
కుటుంబాలు
ఖరారు
చేసి
త్వరలో
ప్రకటిస్తారని
సన్నిహితులు
చెబుతున్నారు.
ఖతీజా
14
ఏళ్ల
వయసులో
శంకర్
దర్శకత్వంలో
రజనీకాంత్
నటించిన
'ఎంతిరన్'(తెలుగులో
రోబో)లో
"పుధియా
మనిధా"(ఓ
మరమనిషి)
పాటతో
ప్లేబ్యాక్
సింగింగ్
ఫీల్డ్
లోకి
అడుగుపెట్టింది
మరియు
వివిధ
వేదికలపై
తన
సంగీత
ప్రయాణాన్ని
కొనసాగిస్తోంది.