భీష్మ సెకండ్ సింగిల్.. వాటే బ్యూటీ సాంగ్ విడుదల
నితిన్-రష్మిక మందన జంటగా.. వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రంలోని రెండో గీతం ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.
హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. పలు అందమైన సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. 'వాటే వాటే వాటే బ్యూటీ' పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ ఆంథమ్ వంటివి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇటీవలె ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ... 'ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. 'వాటే బ్యూటీ' పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది.
జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. 'భీష్మ' చిత్ర కథ, కథనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంద'ని తెలిపాడు.


Click it and Unblock the Notifications











