BTS's Butter.. మ్యూజిక్ వరల్డ్‌లో సంచలనం.. అభిమానిగా మారిన ప్రియాంక చోప్రా భర్త
పాప్ సంగీత ప్రపంచంలోకి దూసుకొచ్చిన మ్యూజిక్ సంచలనం BTS. సంగీతాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరి నోట వినిపిస్తున్న మాట బీటీఎస్ టీమ్ పేరే. గతేడాది వారు అందించిన డైనమేట్ ఆల్బమ్‌తో ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులను ఉర్రూతలూగించారు. తాజాగా Butter పాటతో ఈ బీటీఎస్ టీమ్ సంగీత అభిమానులకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా Butter సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

దక్షిణా కోరియాకు చెందిన బీటీఎస్
దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కలిసి ఏర్పాటు చేసిన మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది. ఈ టీమ్‌లో జిన్, సుగా, జే హోప్, ఆర్, జిమిన్, వీ, జంగ్‌కుక్ సభ్యులుగా ఉన్నారు. ఈ టీమ్‌కు అనూహ్యమైన ఫాలోయింగ్ ఏర్పడింది. వారు రూపొందించే పాటలకు భారీ హిట్స్ సాధిస్తున్నాయి.

బటర్ సాంగ్‌కు అనూహ్య స్పందన
BTS టీమ్ రూపొందించిన బటర్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధించింది. ఎనిమిది గంటల్లో 56,252,720 వ్యూస్ సాధించింది. 5.6 మిలియన్ల లైక్స్, 6.3 మిలియన్ డిస్‌లైక్స్ వచ్చాయి. దాదాాపు 2,457,969 కామెంట్లు నమోదయ్యాయి.

మా జీవితాలను మార్చేస్తున్నారు...
తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలపై బీటీఎస్ టీమ్ స్పందిస్తూ.. ఫ్యాన్స్ మా జీవితాలను అనూహ్యంగా మార్చిపడేశారు. మా మాటలకు, మ్యూజిక్‌కు ఇంత పవర్ ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని కలిగించారు. మా మ్యూజిక్ వింటూ... నా సందేశాలను ఆదరిస్తున్న ప్రతీ ఫ్యాన్‌కు థ్యాంక్స్ అని అన్నారు.
Recommended Video

అభిమానిగా మారిన ప్రియాంక చోప్రా భర్త
ఇక బీటీఎస్ టీమ్‌కు ప్రియాంక చోప్రా భర్త, మ్యూజిషియన్ నిక్ జోనస్ కూడా అభిమానిగా మారిపోయారు. మే 23 తేదీన నిక్ జోనస్ హోస్ట్ చేయబోయే బిల్‌బోర్డు మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో బీటీఎస్ పాటలు నామినేట్ అయింది. ప్రపంచంలోనే టాప్ సెల్లింగ్ పాటగా డైనమెట్ ఆల్బమ్ సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











