GodFather ఫైట్‌కు మ్యూజిక్ మిక్స్ చేసి నెక్ట్స్ లెవెల్.. తమన్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు

అనంతపురంలో నిర్వహించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్ పై మెగాస్టార్ చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు. భారీ వర్షం కురుస్తున్నా..పట్టించుకోకుండా చిరంజీవి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమాను కష్టపడి.. పంచ ప్రాణాలు పెట్టి కథ, కథనాలు తయారు చేశాం. అయితే ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లడానికి ఆరో ప్రాణం కావాలి. ఈ సినిమాకు ఆరోప్రాణం తమన్. నిజంగా మనస్పూర్తిగా నేను చెబుతున్నాను. తమన్ సరస్వతి పుత్రుడు. పియానో మీద వేళ్లతో తాకుతూ పాటలు వినిపిస్తుంటే.. కాదనలేం. చిన్న వయసులోనే జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమా రీరికార్డింగ్, హై ఒక ఎత్తు. ఈ సినిమాలో నేను నిశ్బబ్దంగా, డైలాగ్ చెప్పకుండా హీరోయిజాన్ని తన మ్యూజిక్‌తో తమన్ తీసుకొచ్చాడు. ఆ సీన్లకు తన బీజీఎంతో ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి తదితరులు సాహిత్యాన్ని అద్బుతంగా అందించారు.

S Thaman

వాస్తవానికి ఈ సినిమాలో మ్యూజిక్‌కు స్థానం లేదు. కానీ తమన్ వచ్చిన తర్వాత.. ఈ సినిమాను మ్యూజిక్ సినిమా చేసి చూపిస్తానని చెప్పాడు. ఇది పొలిటికల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమా మిమ్మల్ని అద్భుతంగా అలరిస్తుంది. రోమాలు నిక్క బొడుచుకొనేలా తమన్ రీరికార్డింగ్ చేశాడు. చివరకు మీరే అంతిమ న్యాయనిర్ణేతలు. మీ తీర్పు మాకు శిరోధార్యం అని చిరంజీవి అన్నారు.

గాడ్ ఫాదర్ సినిమాలో నజబజజర పాట లేదు. అయితే ఈ సినిమాలో ఫైట్‌కు పాట చేస్తానని చెప్పి.. నజబజజర పాటను తమన్ ఇచ్చాడు. అయితే రామ్ లక్ష్మణ్ ఆ పాటకు మంచి ఫైట్స్‌ను డిజైన్ చేశారు. నా పాత్రకు సంబంధించిన హీరోయిజాన్ని పైకి లేపింది. రామ్ లక్ష్మణ్ గురించి మీకు తెలియదు. యోగా, క్రియా యోగా చేస్తారు. కానీ వారు రంగంలోకి దిగితే అరాచకమే అని చిరంజీవి అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X