Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘రంగులద్దుకున్నా’.. ఎస్పీబీకి అంకితం.. దేవీ శ్రీ ప్రసాద్ ఎమోషనల్
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంపై ఆ మధ్య ఎంతగా ట్రోలింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తమన్ సంగీతం, ఆల్బమ్స్‌తో పోలికలు పెడుతూ దేవీని ట్రోల్ చేసేవారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సంగీతాన్ని, పాటలు పోల్చుతూ సోషల్ మీడియాలో బాగానే చర్చ నడిచింది. అయితే తన నుంచి రాబోతోన్న సినిమాల్లో సంగీతం కొత్తగా ఉంటుందని ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. చెప్పినట్టుగానే దేవీ శ్రీ ప్రసాద్ ఉప్పెన పాటలతో సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఉప్పెన పాటలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన రంగులద్దుకున్న అనే పాట కూడా బాగానే ఆకట్టుకుంటోంది. నిన్న విడుదల చేసిన లిరికల్ ప్రోమోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఈ పాటను మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేశాడు. ఉప్పెన నుంచి లవ్లీ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాను.. నా ఫేవరేట్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.. సుకుమార్ గారు.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బుచ్చి బాబు సన అందరికీ కంగ్రాట్స్ అని తెలిపాడు.

మహేష్ బాబు అందించిన విషెస్‌కు దేవీ శ్రీ ప్రసాద్ రియాక్ట్ అయ్యాడు. ఉప్పెన నుంచి రంగులద్దుకున్నా అనే పాట రిలీజ్ చేసినందుకు థ్యాంక్యూ అండ్ లవ్యూసూపర్ స్టార్.. అని దేవీ ట్వీట్ చేశాడు. లాక్డౌన్ తరువాత విడుదలైన నా మొదటి పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌కి అంకితం చేస్తున్నాను అని చెప్పాడు. ఈ పాటలో సంగీతం సాహిత్యమే కాదు విజువల్స్, హీరో హీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి.