For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sid Sriram మ్యాజిక్.. లంబసింగి మూవీ కోసం నచ్చేసిందే నచ్చేసిందే అంటూ

  |

  సక్సెస్‌పుల్, స్టార్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ సమర్పణలో కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ రూపొందిస్తున్న చిత్రం లంబసింగి. ఈ సినిమాకు నవీన్ గాంధీ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినీ వర్గాల మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ బ్యూటీఫుల్ పాటను విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరాం పాడటం విశేషం. ఆయన పాడిన ఈ మధుర గీతం గురించిన వివరాల్లోకి వెళితే..

  Divi Vadthya look Beautiful in Sid Srirams Nachchesinde song in Lanbasingi movie

  నచ్చేసిందే నచ్చేసిందే.. మెచ్చేసిందే.. మెచ్చేసిందే అంటూ సాగే పాటకు ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. RR ధ్రువన్ మ్యూజిక్ అందించగా.. సిద్ శ్రీరాం గానామృతాన్ని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అందించారు.

  పాట లిరిక్స్ ఇలా..

  నచ్చేసిందే నచ్చేసిందే.. నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
  నవ్వేసిందే.. నవ్వేసిందే.. నా మనసు తవ్వేసిందే ఇల్లా
  చిట్టి గుండె జారి.. మొట్టమొదటిసారి
  కొట్టుకోవడం తాను మరిచిందేమో..
  పుట్టు కురులా గాలి..చుట్టుకుందే తల్లి..
  శ్వాస తీసి మళ్లీ సాగిందేమో..
  కలలు కవితలు తడిమిన క్షణమున

  నచ్చేసిందే.. నచ్చేసిందే..నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
  నవ్వేసిందే.. నవ్వేసిందే.. నా మనసు తవ్వేసిందే ఇల్లా
  ముందే కలిసినట్టు.. తను ఎంతో తెలిసినట్టు..
  తెగ అనిపిస్తుందే ఎందు వలన
  ప్రతి నిమిషం కలువాలంటూ..
  గడియారం ముల్లు చుట్టు
  తిరిగేస్తున్నాయి.. ఏం చెప్పలేకుండా
  ఆమె చూపు తాకినా..
  మంచులాగా మారనా
  ఒక్క జన్మ చాలునా.. ఇంత హాయిగా..
  పెదవి పలుకులు వెతికిన క్షణమున

  నచ్చేసిందే నచ్చేసిందే.. నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
  నవ్వేసిందే.. నవ్వేసిందే.. నా మనసు తవ్వేసిందే ఇల్లా
  గుండె తలుపు తట్టి..
  నన్ను అదృష్టంలా పట్టి
  నా సంతోషానికి సంతకమయిందే..
  ప్రతీ రోజు పక్కన ఉంటూ..
  తన ఊపిరి చప్పుడు వింటూ
  నిశ్శబ్దంగా నిదురోవాలని ఉందే..
  అడుగు వేసే లోపునా..
  అడుకుండా నీడలా
  తనకు నేను కాపలా..
  అన్ని వైపులా..
  సెలవు ఇక అడగను ఏ క్షణమునా
  నచ్చేసిందే నచ్చేసిందే.. నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
  నవ్వేసిందే.. నవ్వేసిందే.. నా మనసు తవ్వేసిందే ఇల్లా

  మెలోడిగా సాగిన ఈ రొమాంటిక్ పాటలో దివి వద్యా, భరత్ మధ్య కెమిస్ట్రీ ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా.. మంచి ఫీల్‌ను కలిగించింది. రానున్న రోజుల్లో ఈ పాట తప్పకుండా చార్ట్ బస్టర్‌లో హిట్ సాంగ్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  నటీనటులు: భరత్, దివి వద్యా, రమణ, వంశీరాజ్, జనార్ధన్, అనురాధ తదితరుల
  కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: నవీన్ గాంధీ
  నిర్మాత: జికే మోహన్
  సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల
  బ్యానర్: కాన్సెప్ట్ ఫిల్మ్స్
  డివోపీ: కే బుజ్జి
  సంగీతం: ఆర్ఆర్ దృవన్
  ఎడిటర్: కే విజయ్ వర్ధన్

  English summary
  Successful director Kalyan Krishna Kurasala who delivered a blockbuster with his last movie Bangarraju which ended up as a Sankranthi winner presents a new film being produced by GK Mohan under Concept Films banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X