For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Telugu Indian Idol : ఉంగరాలిచ్చిన నిత్య మీనన్.. స్టేజ్ మీదనే ఎంగేజ్మెంట్

  |

  అల్లు అరవింద్ ఆధ్వర్యంలో మొదలైన 'ఆహా'.. తెలుగు లీడింగ్ ఓటీటీ సంస్థగా నిలబడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విభిన్న పద్ధతులు ఫాలో అవుతున్న ఆహా ఇప్పటికే 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' వంటి టాక్ షోలతో పాటు కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తూ తన సత్తా చాటింది. ఇక కొత్త ట్యాలెంట్ ను వెలికి తీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ తానా ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు

  తెలుగు వారికి అవకాశం

  తెలుగు వారికి అవకాశం

  ఇప్పటికే తెలుగులో పలు సింగింగ్ రియాలిటీ షోలు సూపర్ హిట్ అవ్వడమే కాక పలువురు మంచి గాయకులను సైతం ఇండస్ట్రీకి అందించాయి. ఇప్పుడు అదే బాటలో తెలుగు సినిమాలకు గాన గంధర్వులని అందించడమే లక్ష్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ షోని ఆహా నిర్వహిస్తుంది.

  26వ ఎపిసోడ్

  26వ ఎపిసోడ్

  'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్, ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన శ్రీరామ్ చంద్ర ఈ షోని హోస్ట్ చేస్తుండగా నిత్యా మీనన్, సంగీత సంచలనం థమన్, సింగర్ కార్తీక్ వంటి వారు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే 26 ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా నిర్వహించగా ఆ ఎపిసోడ్స్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా విడుదలైన 26వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండగా అందులో ఒక సన్నివేశం ఆసక్తి రేకెత్తించింది.

  కీలక దశలోకి

  కీలక దశలోకి


  ఆసక్తికరంగా సాగుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం 8 మంది పోటీ పడుతున్నారు. వెడ్డింగ్ స్పెషల్‌లో 4 ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది. ముందుగా పార్టిసిపెంట్ వైష్ణవి నాయక్ చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా' పాటను పాడి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇళయరాజా స్వరపరిచిన 'శుభలేఖ రాసుకున్నా' సాంగ్ ను నాయక్ కోసం తమన్ రీమిక్స్ చేశారు. ఇక వైష్ణవి తన పెర్ఫార్మన్స్ కు గాను బొమ్మా బ్లాక్‌బస్టర్ ట్యాగ్‌ని పొందింది. తర్వాత కార్తీక్‌తో కలిసి పాడాలని కోరగా కొత్త బంగారు లోకం చిత్రం నుంచి 'హరే హరే హరే రామ' అని పాడారు.

  మిశ్రమ స్పందనలు

  మిశ్రమ స్పందనలు


  ఇక పార్టిసిపెంట్ లాలస అరుంధతి చిత్రంలోని 'చందమామ' పాటను పాడారు. లాలస బాగానే పాడారు కానీ న్యాయనిర్ణేతల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఎనర్జిటిక్ మోడ్‌లో పాడడంలో మరింత శ్రద్ధ వహించాలని న్యాయమూర్తులు ఆమెను కోరారు. పార్టిసిపెంట్ శ్రీనివాస్ రెడీ నుండి నిన్నే 'పెళ్లాడుకుని రాజైపోతా' పాటను పాడారు. కార్తీక్‌, నిత్యలకు శ్రీనివాస్ పెర్‌ఫార్మెన్స్‌ నచ్చగా, థమన్‌ కు పెర్‌ఫార్మెన్స్‌ నచ్చలేదు కానీ ఇది మునుపటి కంటే మెరుగైన పెర్‌ఫార్మెన్స్‌ అని థమన్ చెప్పారు.

  అధికారికంగా నిశ్చితార్థం

  అధికారికంగా నిశ్చితార్థం

  ఇక ఈక్రమంలో శ్రీనివాస్ గర్ల్‌ఫ్రెండ్ షోకి సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ వేదికపై అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. నిత్యా మీనన్ వారికి ఉంగరాలు బహుమతిగా ఇచ్చింది. ఇక పార్టిసిపెంట్అదితి భావరాజు ఘర్షణ చిత్రం నుండి అందగాడా పాటను పాడింది. ఆమె అందంగా పాడింది కానీ థమన్ ల్యాండింగ్ నోట్స్ చూసుకోమని కోరారు. ఇక ఈ వారంలో ఎలిమినేషన్ జరగ లేదు కాబట్టి షోలో 8 మంది సభ్యులు కొనసాగుతున్నారు.

  English summary
  The engagement of participant Srinivas happened on the Telugu Indian Idol stage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X