For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిచీ గాడి పెళ్లి పాటను ఆవిష్కరించిన సందీప్ కిషన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా

  |

  కేఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ రూపొందించిన రిచి గాడి పెళ్లి చిత్రం నుండి రెండో పాటను యువ హీరో సందీప్ కిషన్ ఆవిష్కరించారు. గేయ రచయిత శ్రీమణి రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు సాహిత్యం అందించారు. శక్తి శ్రీ గోపాలన్, సత్యన్ ఈ పాటని పాడారు.. ఈ పాటకు సందీప్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

   Hero Sandeep Kishan released Richi Gadi Pelli Song

  నా నిన్నలలో పాటను విడుదల చేసిన తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ.. రిచిగాడి పెళ్లిలోని రెండో సాంగ్ పాటను చూశాను. శక్తి శ్రీ గోపాలన్, సత్య అద్బుతంగా పాడారు. నాకు చాలా బాగా నచ్చింది. విజువల్ ట్రీట్‌లా అనిపించింది. సినిమాటోగ్రఫి పనితనం కూడా చాలా బాగుంది. దర్శకుడు హేమ్రాజ్, చిత్ర యూనిట్‌కు టీమ్ ఆల్ ద బెస్ట్. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల, వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు.

   Hero Sandeep Kishan released Richi Gadi Pelli Song

  దర్శకుడు కేఎస్ హేమరాజ్ మాట్లాడుతూ.. రిచి గాడి పెళ్లి అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ శ్రీమణి రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. శ్రీమణి, సింగర్స్‌కు ధన్యవాదాలు. మా డివోపీ విజయ్ ఉలగనాథ్ చేసిన వర్క్ హైలైట్‌గా నిలుస్తుంది. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.

  నటీనటులు: సత్య ఎస్కే, చందన రాజ్, నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, బన్ని వాక్స్, సతీష్ శెట్టి, కియారా నాయుడు, చందనా రాజ్, ప్రవీణ్ రెడ్డి, మాస్టర్ రాకేష్ తమోగ్న
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేఎస్ హేమరాజ్
  నిర్మాత: KS ఫిల్మ్ వర్క్స్
  సినిమాటోగ్రఫీ - విజయ్ ఉలగనాథ్
  బ్యానర్ పేరు: కెఎస్ ఫిల్మ్ వర్క్స్
  సంగీతం: సత్యన్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: బ్రిట్టో మైఖేల్
  ఎడిటర్: అరుణ్ ఎమ్
  కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
  సాహిత్యం: అనంత్ శ్రీరామ్ & శ్రీ మణి
  డైలాగ్స్: రాజేంద్ర వైట్ల
  ఆర్ట్: హరి వర్మ
  కొరియోగ్రాఫర్: సతీష్ శెట్టి
  డిజైన్స్: రెడ్డాట్ పవన్
  కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు
  మేకప్: అంజలి సంఘ్వి & నికిత
  ఆడియోగ్రఫి: ఆర్ కృష్ణమూర్తి
  ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రామ్ మహీంద్రా &శ్రీ
  సహ నిర్మాత: సూర్య మెహర్
  డిజిటల్: మనోజ్
  పీఆర్వో: మధు VR

  పాటల వివరాలు:
  పాట: నా నిన్నలో...
  గీత రచయితలు - అనంత శ్రీరామ్ & శ్రీమణి
  గాయకులు: కైలాష్ ఖర్, శక్తి శ్రీగోపాలన్ & సత్యన్
  గాయకులు: శక్తిశ్రీ గోపాలన్ & సత్యన్
  సాహిత్యం: శ్రీ మణి

  English summary
  Richi Gadi Pelli song released by Sandeep Kishan. This movie first look released by Aishwarya Rajesh. This film is under post production. Comedian Naveen is the main lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion