Don't Miss!
- News
sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Grammy Awards 2022.. లతా మంగేష్కర్‌కు తీరని అవమానం.. నిర్వాహకుల పక్షపాత ధోరణితో..
ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో అత్యుత్తమ అవార్డులుగా భావించే గ్రామీ అవార్డుల కార్యక్రమం బ్రహ్మండంగా కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్‌కు సంబంధించిన యువ ప్రతిభావంతులు, లెజెండ్స్ హాజరయ్యారు. అయితే ఐదు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో మహారాణిగా వెలుగొందిన ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంలో లెజెండ్ సింగర్ లతాకు నివాళులర్పించకపోవడంపై సంగీత అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వస్తే.. 1949లో కెరీర్ ఆరంభించారు. హిందీలో వేలాది పాటలు పాడారు. అంతేకాకుండా అనే భారతీయ భాషల్లోను, విదేశీ భాషలో కూడా అనేక పాటలు పాడారు. ముఖ్యంగా మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఎక్కువగా తన పాటలను ఆలపించారు. సినీ పరిశ్రమకు చేసిన సేవల గుర్తుగా లతా మంగేష్కర్ కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతోపాటు భారత రత్నను కూడా ప్రదానం చేసింది. అయితే కరోనావైరస్ కారణంగా అనారోగ్యానికి గురైన లతా ఇటీవల ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రపంచ ప్రఖ్యాత లతా మంగేష్కర్‌కు గ్రామీ అవార్డుల వేదిక, నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై మీడియాలోను, సోషల్ మీడియాలోను నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప గాయనికి దక్కాల్సిన ఖ్యాతి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో కూడా లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌ను విస్మరించడంపై భారీగా చర్చ జరిగింది. భారతీయ కళాకారులను పదే పదే అంతర్జాతీయ సినీ, సంగీత వేదికలు విస్మరించడంపై అభిమానులు కన్నెర్ర చేస్తున్నారు.