Don't Miss!
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- News
viral video:ఏందిది..? పార్క్ చేసిన బైక్ నుంచే సీసీ రోడ్డు, అందుకు పర్మిషన్ ఇవ్వలేదట..?
- Finance
SBI Alert: KYC పూర్తి చేయని ఖాతాలకు షాకిచ్చిన SBI.. అకౌంట్ల నుంచి క్యాష్ విత్ డ్రా కావట్లేదు..
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
- Sports
IND vs SL: వారెవ్వా వాటే కీపింగ్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వీడియో
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
NTR 30: మొదటిసారి అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఎంతంటే?
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయిక లో రాబోతున్న మరో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నందమూరి అభిమానుల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తప్పకుండా ఈ సినిమా కూడా అంతకుమించి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ ను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అభిమానుల నుంచి కూడా ఎక్కువగా డిమాండ్ వచ్చింది ఆ విషయంలో. మ్యూజిక్ డైరెక్టర్ అతన్ని అనిరుద్ ను సెలెక్ట్ చేసుకోవాలి అని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో కొన్ని ట్యాగ్స్ ను కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు.

ఒక విధంగా అది చాలా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న అనిరుద్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలు అయితే చేయలేదు. ఇక అతను కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా ద్వారా మొదటి సారి పాన్ ఇండియా ప్రపంచం లోకి అడుగుపెట్టబోతున్నాడు. కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాకుండా హిందీ అలాగే కన్నడ మలయాళం ప్రేక్షకులకు నచ్చే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేయాలి కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అనిరుద్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా చర్చలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక పారితోషికం విషయంలో కూడా అనిరుద్ రవిచందర్ గట్టిగానే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో అనిరుద్ ఒకరు. మాస్టర్ విక్రమ్ సినిమాల కోసం అతను మూడు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం అంతకంటే ఎక్కువగా దాదాపు నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రేంజ్ లో అందుకోబోతున్న అనిరుద్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.