Don't Miss!
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. వెంటపడి ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్.. ఎలా జరిగిందంటే?
ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ కి ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. ఆమె ఏ పాట పాడిన కూడా యూట్యూబ్లో అయితే మిలియన్స్ వ్యూవ్స్ అందుకుంటు ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆమె అభిమానుల చేత ఊహించిన విధంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది యువకులు సింగర్ మంగ్లీ కారుపై ఒక్కసారిగా దాడి చేయడం తో ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎంతో పాజిటివ్ గా ఉండే సింగర్ మంగ్లీ కారుపై దాడి చేయడానికి గల కారణం ఏమిటి అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

స్టార్ సింగర్ గా గుర్తింపు
సింగర్ మంగ్లీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలలో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ఆమె ఎలాంటి పాట పాడిన కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్టులో చేరిపోతున్నాయి. అందుకే ఆమెతో పాటలు పాడించడానికి తెలుగు సంగీత దర్శకులు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆమెకు ఆఫర్స్ చేస్తున్నారు. దీంతో మంగ్లీ కూడా మంచి మ్యూజిక్ కంటెంట్ ఉన్న సాంగ్స్ ను సెలెక్ట్ చేసుకుంటుంది.

కర్ణాటకలో ఫ్యాన్ ఫాలోయింగ్
సాధారణంగా మంగ్లీ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అలాగే ఆమె రీసెంట్ గా కర్ణాటక వెళ్ళగా అక్కడ కూడా భారీ స్థాయిలో అభిమానులు ఆమెను చూసేందుకు వచ్చారు. వీలైనంతవరకు ఆమె ఫ్యాన్స్ అందరిని కూడా ఫ్రెండ్లీగా కలుసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇక బిజీగా ఉన్న సమయంలో మాత్రం ఆమె సున్నితంగా కొన్నిసార్లు కలవలేను అని ఫ్యాన్స్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కారుపై రాళ్లదాడి
అయితే
ఇటీవల
సింగర్
మంగ్లీ
కారు
పై
ఒక్కసారిగా
రాళ్ల
దాడి
చేయడంతో
అందరూ
ఆశ్చర్యాన్ని
గురయ్యారు.
కర్ణాటకలో
జరిగిన
ఒక
ఈవెంట్
కోసం
వెళ్ళిన
ఆమె
అక్కడ
కార్యక్రమాన్ని
ముగించుకొని
బయటకు
వెళుతూ
ఉండగా
కొందరు
రాళ్లు
విసరడం
వలన
ఆమె
ఇబ్బంది
పడ్డారు
.
అప్పటికి
సెక్యూరిటీ
అందిస్తున్న
పోలీసులు
కంట్రోల్
చేసినప్పటికీ
కూడా
మంగ్లీ
కారుపై
రాళ్లు
పడడంతో
ఆమె
కారు
కూడా
కొంత
డ్యామేజ్
అయింది.

ఆ వేడుక కోసం..
అసలు వివరాల్లోకి వెళితే.. బళ్లారి ఫెస్టివల్స్ లో సందర్భంగా ఇటీవల బళ్లారి మున్సిపల్ కళాశాల గ్రౌండ్లో జరిగిన ఒక ఫెస్టివల్ లో మంగ్లీ పాల్గొన్నారు. అయితే అదే వేడుకకు పునీత్ కుమార్ భార్య అశ్విని అలాగే సీనియర్ నటుడు రాఘవేంద్ర కుమార్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక సింగర్ మంగ్లీతోపాటు కన్నడకు సంబంధించిన మరి కొంత మంది గాయని గాయకులు కూడా వేడుకలో పాటలు పాడుతూ కనిపించారు.

మేకప్ టెంట్ లోకి వచ్చిన యువకులు
కా
వేడుకకు
సింగర్
మంగ్లీ
వచ్చిందని
తెలుసుకున్న
అభిమానులు
ఆమెను
చూసేందుకు
చాలా
ఎగబడ్డారు.
అంతేకాకుండా
ఫోటోలు
దిగాలి
అని
మేకప్
టెంట్
లోకి
కూడా
వెళ్లారు.
ఇక
వెంటనే
సెక్యూరిటీ
ఇస్తున్న
పోలీసులు
కూడా
యువకులను
చెదరగొట్టి
అక్కడ
నుంచి
పంపించేశారు.
ఇక
చివరికి
మంగ్లీ
ప్రోగ్రామ్
ముగించుకుని
వెళుతుండగా
ఆమె
కారును
కొంతమంది
యువకులు
అడ్డగించారు.

కారణం ఇదే..
ఇక మంగ్లీ వెళ్ళిపోతూ ఉండగా ఊహించిన విధంగా మరికొంతమంది యువకులు ఆమె కారు ముందువైపుకు వచ్చి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులకు యువకుల మధ్య కొంత తోపులాట జరిగింది. అనంతరం మంగ్లీ కారుపై రాళ్ల దాడి చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు మరొక కారణం కూడా ఉంది అనిపిస్తోంది. సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడాలని అక్కడే ప్రముఖ యాంకర్ సూచించారట. అయితే రెండు మూడు మాటలు మాట్లాడిన మంగ్లీ ఇక్కడ అందరికీ తెలుగు వస్తుంది అని ఆమె మళ్ళీ తెలుగులోనే మాట్లాడడంతో అక్కడివారు కొత్త అసంతృప్తితో ఈ విధంగా రాళ్ల దాడి చేసినట్లుగా చెబుతున్నారు.