Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
Waat Laga Denge: పూరీ మార్క్ మాస్ ట్రీట్.. అదరగొట్టిన విజయ్ దేవరకొండ
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోల్లో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు. ఇది సూపర్ హిట్ అవడంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇలా కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్నాడు.
స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!
ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పాటు బాలీవుడ్‌లోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయిపోయింది. ఆ వెంటనే ప్రారంభించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా రేంజ్ ఖండాంతరాలు దాటిపోయిందనే అనుకోవాలి. ఇక, ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందుకోసం స్పెషల్ ప్లాన్లను కూడా రెడీ చేసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
Ramarao On Duty Twitter Review: రవితేజ మూవీ పరిస్థితి ఇదా.. కొత్త సమస్య.. ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే!
'లైగర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ తాజాగా దీని నుంచి ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. 'వాట్ లగా దేంగే' అంటూ సాగే ఈ పాటలో హీరో క్యారెక్టరైజేషన్‌ను హైలైట్ చేస్తూ చూపించారు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన ఈ పాటను విజయ్ దేవరకొండ ఆలపించాడు. దీనికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లిరిక్స్ రాశాడు. దీంతో ఈ సాంగ్‌కు విజయ్ దేవరకొండ అభిమానుల నుంచే కాకుండా అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ పాటకు వ్యూస్, లైకులు భారీగా వస్తున్నాయి. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండతో పాటు లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.