Waltair Veerayya: తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు.. వీరయ్య టైటిల్ సాంగ్ అదిరింది!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
ఇక ప్రతిపాట కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఇటీవల విడుదల చేసిన మరో పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. వీరయ్య టైటిల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ అయితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యం అయింది. ఇంకా మొత్తానికి లిరికల్ సాంగ్ కూడా వచ్చేసింది.

ఆడియన్స్ నుంచి ఈ పాట అద్భుతమైన క్రేజ్ అందుకుంటోంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట లో చంద్రబోస్ అందించిన లిరిక్స్ కూడా ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు.. అనే ఒక లైన్ కూడా ఎంతో హైలైట్ గా నిలిచింది. ఈ పాటతోనే సినిమాపై అంచనాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు.
ఇక జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.. ఇదివరకే విడుదలైన రెండు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అయితే మరో లెవెల్లో ఉందని కూడా సెలబ్రెటీలు సైతం కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా మాస్ మహారాజా రవితేజ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











